CM KCR Inuagurated : గుడి..మసీద్..చర్చి రెడీ
ప్రారంభించనున్న కేసీఆర్
CM KCR Inuagurated : తెలంగాణ సచివాలయంలో పునర్ నిర్మించిన గుడి – మసీదు- చర్చిలను ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. వీటిని స్టార్ట్ చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఆగస్టు 25న కేసీఆర్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇవాళ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. త్వరలోనే ఎన్నికలు రానున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇప్పటికే భారీ ఖర్చుతో తెలంగాణ సెక్రటేరియట్ ను నిర్మించారు. దీనికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని పేరు పెట్టారు.
CM KCR Inuagurated Will Soon
తాజాగా సచివాలయ ఆవరణలో ఆలయం, మసీదు , చర్చిలను ఒకే చోట నిర్మించారు. ఈ మూడు సర్వ మత సమ్మేళనానికి అద్దం పడుతోంది ఈ నిర్మాణం. చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దాదాపు 90 శాతానికి పైగా పూర్తి కావడంతో ఉన్న ఒకటి రెండు రోజుల్లో 100 పూర్తి చేయాలని సంకల్పించారు. ఈ మేరకు మంత్రి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎలాగైనా సరే సీఎం ప్రారంభోత్సవానికి సిద్దం అయ్యే లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
గుడిలో శివుడు, వినాయకుడు, పోచమ్మ, హనుమంతుడి ఆలయాలు ఉన్నాయి. వీటిని తిరుపతి నుంచి తెప్పించారు. ప్రారంభోత్సవం సందర్బంగా సర్వ మతాలకు చెందిన పెద్దలతో ప్రార్థనలు ఉంటాయని సమాచారం. గంగా జమునా తెహజీబ్ అనే స్పూర్తిని చాటేలా వీటిని నిర్మించామన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి(Vemula Prasanth Reddy).
Also Read : Vote For Sure : ఓటు ఆయుధం కాపాడుకుందాం