YS Sharmila : నాకేమైనా అయితే కేసీఆర్ దే బాధ్యత – షర్మిల
ప్రగతి భవన్ పై రైడ్స్ జరగాలని డిమాండ్
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. గురువారం వైఎస్ షర్మిల తన అనుచరులతో కలిసి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ను కలిశారు. ఈ సందర్భంగా తమపై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో దాడులు జరిగేందుకు ప్లాన్ చేస్తున్నారని తనకు రక్షణ కావాలని కోరారు.
ఈ మేరకు గవర్నర్ కు వినతి పత్రం సమర్పించారు వైఎస్ షర్మిల(YS Sharmila). నాకు ఏం జరిగినా నా మనుషులకు ఏమైనా జరిగితే పూర్తిగా బాధ్యత వహించాల్సింది సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. తెలంగాణ ఆఫ్గనిస్తాన్ గా మారి పోయిందన్నారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడిన మాటలపై నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల.
తనను నలిపి వేస్తానని అంటున్నాడని, వీళ్లంతా ఆఫ్గనిస్తానీయులేనని పేర్కొన్నారు. ఓ బాధ్యత కలిగిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తనను మరదలి అని సంబోధించాడని అందుకే చెప్పుతో కొడతానని అన్నానని, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. మొన్నటి దాకా బీజేపీతో డ్యూయెట్లు పాడుకున్నది ఎవరని ప్రశ్నించారు.
తాను ఒకవేళ కాంగ్రెస్ లోనో లేదా బీజేపీ లోనో చేరి ఉంటే తనకు మంచి పదవి దక్కేదన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేసిన ఘనత టీఆర్ఎస్ కు దక్కిందన్నారు. మిగుల బడ్జెట్ తో కలిగి ఉన్న తెలంగాణ ఇప్పుడు 4 లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టాడంటూ ఆరోపించారు. లిక్కర్, పేకాట, రియల్ ఎస్టేట్, ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ అన్ని అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.
సుదర్శన్ రెడ్డి మగతనంతో తనకు ఏం సంబంధం అన్నారు. తనకు జరిగిన అన్యాయం, జరగబోయే దాడుల గురించి రాష్ట్ర హైకోర్టుకు, సీజేఐకి లేఖలు రాస్తామన్నారు వైఎస్ షర్మిల.
Also Read : అమిత్ ఎవరో తెలియదు-మాగుంట