CM KCR : ఇక దేశమంతటా గులాబీమయం – కేసీఆర్
కర్ణాటకలో పోటీ చేస్తం కుమారకు మద్దతు ఇస్తం
CM KCR : భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా గులాబీమయం కావడం ఖాయమన్నారు సీఎం కేసీఆర్ . దేశానికి తెలంగాణ ఆదర్శం కావాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. ప్రస్తుతం రాజకీయాలు కేవలం ఎన్నికల్లో గెలిచేందుకు మాత్రమే మారాయని ఇది మంచి పరిణామం కాదన్నారు. ప్రజలు గెలవాలన్నారు కేసీఆర్(CM KCR) .
దేశంలో అపారమైన వనరులు ఉన్నాయని, వాటిని వాడుకోక పోవడం వల్లనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశం చీకట్లో ఉందని అందుకే బీఆర్ఎస్ దీపం వెలిగిస్తోందని చెప్పారు సీఎం. ఈనెల 14న ఆఫీసును ప్రారంభిస్తామని తెలిపారు.
గతంలో ఉమ్మడి ఏపీలో తాను తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన సమయంలో అడ్డుకున్నారని, గేలి చేశారని కానీ కొత్త రాష్ట్రాన్ని తీసుకు వచ్చానని అన్నారు. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితిని దేశంలో ఏర్పాటు చేస్తున్నానంటే ఎద్దేవా చేస్తున్నారని కానీ వాళ్లు ఏదో ఒక రోజు విస్తు పోయేలా చేస్తానని స్పష్టం చేశారు కేసీఆర్.
ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా తయారైందన్నారు. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందన్నారు. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు అనే వారని కానీ ఇప్పుడు హైదరాబాద్ జపం చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల మంది స్వంత బలగం ఉందన్నారు కేసీఆర్(CM KCR) .
బీఆర్ఎస్ ను అడ్డుకోవడం ఏ పార్టీ వల్ల కాదన్నారు. ముఖ్యంగా బీజేపీకి సీన్ లేదన్నారు సీఎం. దేశంలో అపారమైన యువత ఉందని వారిని వాడుకోక పోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. యువతను మతోన్మాదులుగా మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు కేసీఆర్.
Also Read : కాషాయం ఖతం ‘గులాబీ’ ఎగరడం ఖాయం