CM KCR : ధరణికి మీరే రాజులు – కేసీఆర్
మార్చే అధికారం నాకు లేదు
CM KCR : సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ధరణిపై పదే పదే అవాకులు చెవాకులు పేలుతున్న ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా కౌంటర్ ఇచ్చారు. ప్రపంచంలోనే ధరణి లాంటి పోర్టల్ ఇంకెక్కడా లేదన్నారు. అర్థం కాని సన్నాసులు మాట్లాడుతుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారి గనుక ధరణిలో భూమి వివరాలు ఎక్కిస్తే సీఎం కాదు కదా పీఎం కూడా మార్చ లేడన్నారు కేసీఆర్. చివరకు నేను కూడా ఏమీ చేయకుండా పకడ్బందీగా తయారు చేశామన్నారు.
CM KCR Slams Opposition
కొందరు పవర్ లోకి వస్తామని కలలు కంటున్నారు. ఉబుసుపోక కబుర్లు చెబుతున్నారు. అలాంటి సొల్లునాయళ్ల మాటలు వింటే మోసపోయేది మీరేనని హెచ్చరించారు. ధరణి అంటే ఒకరికి అప్పనంగా అప్పగించడం కాదన్నారు. ధరణి అంటే భూములపై రైతులకు అధికారం అప్పగించడమే అని కేసీఆర్(KCR) స్పష్టం చేశారు. రైతు భూమిని మార్చాలంటే సీఎంకు కూడా అధికారం లేదని గమనించాలన్నారు.
ఈ అధికారాన్ని ఉంచుకుంటారా లేక పోగొట్టుకుని బానిస బతుకులు బతుకుతారా అని ప్రశ్నించారు. సూర్యాపేట ప్రగతి నివేదన సభలో కేసీఆర్ మాట్లాడారు. ధరణి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్పారు సీఎం. ధరణి వల్ల కేవలం 15 నిమిషాల్లోపే భూములు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని పేర్కొన్నారు. మీ బొటన వేలుకు అంత పవర్ ఉందని గుర్తు చేశారు.
Also Read : Madan Lal Viral : మదన్ లాల్ ఫోటో వైరల్