CM KCR : ప్ర‌జలే నాకు బ‌లం బ‌ల‌గం – కేసీఆర్

కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేద‌న్న సీఎం

CM KCR : గ‌జ్వేల్ – ముందు నుంచి తాను ప్ర‌జ‌ల‌ను న‌మ్ముకున్నాన‌ని , వాళ్లే త‌న‌కు బ‌లమ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం కేసీఆర్. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మంగ‌ళవారం తాను బ‌రిలో ఉన్న గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ చేప‌ట్టిన ఆశీర్వాద‌ స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగించారు. దేశంలో ఎక్క‌డా లేని రీతిలో రైతు బంధు ప్ర‌వేశ పెట్టింది తానేన‌ని అన్నారు. అంతే కాకుండా ప్ర‌తి ఒక్క‌రికి మేలు చేకూర్చేలా ధ‌ర‌ణి పోర్ట‌ల్ ను తీసుకు వ‌చ్చాన‌ని స్ప‌ష్టం చేశారు.

CM KCR Comment

రైతుల భూముల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించిన చ‌రిత్ర త‌మ‌దేన‌ని చెప్పారు కేసీఆర్(CM KCR). అయితే కాంగ్రెస్ వ‌స్తే ధ‌ర‌ణిని తీసేసి భూమాత అని పెడ‌తారంటూ అంటూ ఎద్దేవా చేశారు. ఇదే స‌మ‌యంలో ఆ పార్టీ రైతుల‌కు రైతు బంధు నిధులు రాకుండా అడ్డుకుందంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు సీఎం.

రైతులు గంప గుత్త‌గా బీఆర్ఎస్ పార్టీకి , కారు గుర్తుకు వేయాల‌ని పిలుపునిచ్చారు. రైతు బంధు దుబారా అని ఉత్త‌మ్ కుమార్ అన్నాడ‌ని, ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మూడు గంట‌లు విద్యుత్ చాలని చెబుతున్నాడ‌ని , మ‌రి క‌రెంట్ లేని , నీళ్లు ఇవ్వ‌ని కాంగ్రెస్ సర్కార్ కావాలో తేల్చు కోవాల‌ని హెచ్చ‌రించారు.

ఆరు నూరైనా స‌రే 119 నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను 100 నియోజ‌క‌వ‌ర్గాలలో గులాబీ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు కేసీఆర్.

Also Read : Sonia Gandhi : తెలంగాణ ప్ర‌జ‌లు మ‌న‌సున్నోళ్లు

Leave A Reply

Your Email Id will not be published!