CM KCR : పాలకుర్తి – ఓటు అన్నది ముఖ్యమని, అది వజ్రాయుధం లాంటిదని దానిని సరిగా వినియోగించు కోవాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్(CM KCR). మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకుర్తిలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. ఇది పోవాలంటే తాను మరోసారి సీఎం కావాలని అన్నారు .
CM KCR Quote
ఆనాడు ఒక్కడినే బయలు దేరినప్పుడు ఏ ఒక్కరూ రాలేదన్నారు. కానీ తాను చేసిన ప్రయత్నం వల్లనే, పోరాటం వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని చెప్పారు. కాంగ్రేసోళ్లకు సోయి ఉండదన్నారు. ఇన్నేళ్లయినా తాము చేసిన అభివృద్దిని చూసి విస్తు పోతున్నారని ఈ క్రెడిట్ అంతా బీఆర్ఎస్ సర్కార్ కు దక్కుతుందన్నారు కేసీఆర్.
ఇవాళ తెలంగాణ సర్కార్ అమలు చేసినన్ని సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టకున్నామని చెప్పారు సీఎం. ఇవాళ తమ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందంటూ ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో ధర్మానికి , అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటమని బీఆర్ఎస్ ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు కేసీఆర్.
Also Read : Guvvala Balaraju : దాడులు చేస్తే భయపడను