CM KCR Launches : ఆరోగ్య తెలంగాణ ఆదర్శం
తెలంగాణ సీఎం కేసీఆర్
CM KCR Launches : హైదరాబాద్ – ఆరోగ్య రంగంలో తెలంగాణ ఆదర్శ ప్రాయంగా నిలిచిందన్నారు సీఎం కేసీఆర్. శుక్రవారం ఏకకాలంలో వర్చువల్ గా 9 మెడికల్ కళాశాలలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించారు సీఎం. ఒకే రోజు ఇంత పెద్ద ఎత్తున కళాశాలలను స్టార్ట్ చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటి సారి కావడం గమనార్హం.
CM KCR Launches New Scheme
ఉమ్మడి రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఉండేవి కావని, సీట్లు రావాలంటే నానా తిప్పలు పడేవారని గుర్తు చేశారు కేసీఆర్(KCR). కానీ కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు.
తాను ఉన్నంత వరకు తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకు పోయేందుకు అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు. ఇవాళ కామా రెడ్డి, కరీంనగర్ , ఖమ్మం, భూపాలపల్లి, కుమ్రం భీం, ఆసిఫాబాద్ , రాజన్న సిరిసిల్ల, విరాకాబాద్, జనగాం జిల్లాల్లో తరగుతులు ప్రారంభించడం సంతోషం కలిగిస్తోందని చెప్పారు సీఎం.
ఇంత పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలను ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదన్నారు. ఇది తమ ఘనత అని పేర్కొన్నారు. వైద్య కళాశాల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు పార్టీ శ్రేణులు వివరించాలని ఆదేశించారు కేసీఆర్.
Also Read : Janasena Party : జనసేన విస్తృత స్థాయి సమావేశం