CM KCR Linemen : విద్యుత్ లైన్ మెన్ కు కేసీఆర్ స‌త్కారం

వ‌ర‌ద స‌మ‌యంలో విధి నిర్వ‌హ‌ణ‌కు స‌లాం

CM KCR Linemen : సీఎం కేసీఆర్ ముందు చూపు క‌లిగిన వ్య‌క్తి. ఆయ‌న ఎవ‌రికీ అంద‌డు. విజ‌న్ ఉన్న నాయ‌కుల‌లో కేసీఆర్ ముందంజ‌లో ఉంటారు. ఇదే స‌మ‌యంలో ఎవ‌రైనా త‌న దృష్టిలోకి వ‌స్తే వారి ప‌నితీరును అభినందించ‌డంలో ముందుంటారు కేసీఆర్. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున వ‌ర్షాలు కురిశాయి. వాగులు, వంక‌లు ,కుంట‌లు పొంగి పొర్లాయి. జ‌న‌గాం జిల్లా దేవ‌రుప్ప‌ల మండ‌లం చింత‌ల తాండా , ధ‌ర్మాపురం, ప‌డ‌మ‌టి తండా గ్రామాల‌కు విద్యుత్ స‌ర‌ఫరా నిలిచి పోయింది.

CM KCR Linemen Hardwork Appreciation

ఈ స‌మ‌యంలో ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌కుండా త‌న విద్యుక్త ధ‌ర్మాన్ని నిర్వ‌ర్తించారు విద్యుత్ శాఖ‌కు చెందిన జూనియ‌ర్ లైన్ మెన్ ఎండీ ర‌హ‌మాన్. ఈ విష‌యాన్ని తెలుసుకున్న సీఎం కేసీఆర్(KCR) వెంట‌నే సీఎస్ శాంతి కుమారి ని ఆదేశించారు. విద్యుత్ లైన్ మెన్ కు ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలిపారు. అంతే కాకుండా క‌ష్ట కాలంలో త‌న ధ‌ర్మాన్ని నిర్వ‌హించిన రహమాన్ ఎంద‌రికో ఆద‌ర్శ ప్రాయంగా నిలిచార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు.

విద్యుత్ సంస్థ చైర్మ‌న్ , జిల్లాకు సంబంధించి విద్యుత్ ఎస్ఈ, డీఈ, ఏఈల‌ను కూడా అభినందించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ ను వెంట‌నే జూనియ‌ర్ లైన్ మెన్ ను పంధ్రాగ‌స్టున ప‌రేడ్ మైదానానికి రావాల్సిందిగా ఆదేశించారు. ఈ మేర‌కు 77వ స్వాతంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని సీఎం కేసీఆర్ స్వ‌యంగా అసాధార‌ణ‌మైన ధైర్య సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించిన జూనియ‌ర్ లైన్ మెన్ ఎండీ ర‌హ‌మాన్ ను స‌త్క‌రించారు. ప్ర‌శంసా ప‌త్రాన్ని అంద‌జేశారు.

Also Read : MP Dharmapuri Aravind : బండి ఉన్న‌ప్పుడు గొడ‌వ‌లు జ‌రిగేవి

Leave A Reply

Your Email Id will not be published!