CM KCR : గజ్వేల్ – ఉద్యమ నాయకుడిగా, రెండుసార్లు సీఎంగా కొలువు తీరిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఎవరూ ఊహించని రీతిలో ముచ్చటగా మూడోసారి భారీ విజయాన్ని సాధించి హ్యాట్రిక్ సీఎం అవుదామని అనుకున్న ఆశలపై నీళ్లు చల్లారు ప్రజలు. ఎవరూ ఊహించని రీతిలో రెండు చోట్ల పోటీ చేశారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని పట్టించుకోక పోయినా చివరి దాకా ఉత్కంఠ రేపినా ఎట్టకేలకు కేసీఆర్ ను గట్టెక్కించారు. ఓడి పోనీయకుండా పరువు కాపాడారు.
CM KCR Loss Viral
కామారెడ్డి నియోజకవర్గంలో చెంప ఛెళ్లుమనిపించారు. తెలంగాణ అంటే తానేనని తాను లేక పోతే తెలంగాణ అనే స్థాయికి తనను తాను ఊహించుకున్న దొరకు ఇక చాలంటూ జనం చెప్పకనే చెప్పారు. కేసీఆర్ ఎన్నడూ కలలో కూడా ఊహించ లేదు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎవరైనా సరే తల వంచాల్సిందేనని స్పష్టమైన తీర్పు చెప్పారు ప్రజలు.
పౌర సమాజం మొత్తం చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం విస్తు పోయేలా చేసింది. అధికారం శాశ్వతం అని విర్ర వీగిన గులాబీ నేతలకు కోలుకోలేని షాక్ తగిలింది. కామారెడ్డిలో ఓటమి పాలైన కేసీఆర్ 1985 నుంచి 2004 వరకు సిద్దిపేట నుంచి ఆరుసార్లు గెలుపొందారు.
ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ హవాకు చెక్ పెట్టారు. మొత్తంగా ప్రజా తీర్పు ఒక పాఠంగా మిగిలి పోనుంది.
Also Read : CM KCR : ముఖం చాటేసిన కేసీఆర్