CMs Visit Yadagirigutta : గుట్ట‌లో సీఎంలు స్వామికి పూజ‌లు

పూర్ణ కుంభంతో సాద‌ర స్వాగ‌తం

CMs Visit Yadagirigutta : శ్రీ లక్ష్మీ న‌ర‌సింహ స్వామి కొలువు తీరిన యాద‌గిరిగుట్ట‌లో కొలువు తీరారు సీఎంలు. భార‌త రాష్ట్ర స‌మితిగా మారిన త‌ర్వాత తొలిసారిగా తెలంగాణ‌లోని ఖ‌మ్మంలో బ‌హిరంగ భేరి పేరుతో స‌భ నిర్వ‌హిస్తోంది పార్టీ. ఈ సంద‌ర్భంగా దేశానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖ నేత‌ల‌ను ఆహ్వానించారు సీఎం కేసీఆర్.

ఇందులో భాగంగా సీఎం పిలుపు మేర‌కు కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ , పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ తో పాటు దేశ రాజ‌ధాని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ యాద‌గిరిగుట్ట‌కు(CMs Visit Yadagirigutta) చేరుకున్నారు. హైద‌రాబాద్ కు వ‌చ్చిన వారికి సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ముగ్గురు సీఎంలు నేరుగా కేసీఆర్ ఉన్న ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు వ‌చ్చారు.

అక్క‌డ ముగ్గురు సీఎంల‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్బంగా అద్భుత‌మైన ఆతిథ్యం ఇచ్చారు. కీల‌క‌మైన అంశాల‌పై న‌లుగురు సీఎంలు చ‌ర్చించారు. అనంత‌రం ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు ఆ న‌లుగురు బేగంపేట‌కు వెళ్లారు. అక్క‌డి విమాన‌శ్ర‌యం నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్ లో కేసీఆర్ , అర‌వింద్ కేజ్రీవాల్, పిన‌రయి విజ‌య‌న్ , భ‌గ‌వంత్ మాన్ క‌లిసి యాద‌గిరిగుట్ట‌కు విచ్చేశారు.

అక్క‌డ సీఎంల‌కు పూర్ణ కుంభంతో సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. ఆ ల‌క్ష్మి న‌రసింహ స్వామిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. వారితో పాటు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం, స‌మాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ , ఎమ్మెల్సీ క‌విత కూడా ఉన్నారు. ద‌ర్శ‌నం అనంత‌రం సీఎంల‌కు వేద మంత్రోశ్చార‌ణ‌ల‌తో అర్చ‌కులు ఆశీర్వ‌చనం అంద‌జేశారు. స్వామి వారి చిత్ర‌ప‌టం, తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు.

Also Read : ప్ర‌మాదంలో ప్ర‌జాస్వామ్యం – పిన‌ర‌యి

Leave A Reply

Your Email Id will not be published!