CM KCR Raitu Bandhu : ధరణి ఉంటేనే రైతు బంధు – కేసీఆర్
సంచలన కామెంట్స్ చేసిన సీఎం
CM KCR Raitu Bandhu : తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తాము ధరణి తీసుకు వచ్చామని చెప్పారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. కొందరు బుద్ది లేని వాళ్లు నోటికి వచ్చినట్లు ఏదో మాట్లాడుతుంటారని వారికి ధరణి పట్ల పూర్తి అవగాహన లేదని మండిపడ్డారు కేసీఆర్.
CM KCR Raitu Bandhu Regarding
ధరణి ఉంటే భరోసా..ఆసరా అని పేర్కొన్నారు. ధరణి ఉంటే మీ భూములకు మీరే హక్కుదారులని, వేరే వాళ్లు దానిని తీసుకునేందుకు లేదా ఆక్రమించుకునేందుకు ఏ మాత్రం అవకాశం ఉండదన్నారు కేసీఆర్(KCR). మిమ్మల్ని కాదని మీ పొలాలను ఎవరూ మార్చలేరని, అంత సాహసం చేయలేరని స్పష్టం చేశారు. ఇదే సమయంలో మరో సంచలన ప్రకటన చేశారు. ధరణి ఉంటేనే రైతు బంధు వస్తుదని లేక పోతే రాదని హెచ్చరించారు సీఎం కేసీఆర్.
కొంత మంది ఈ మధ్య 3 గంటల కరెంట్ ఇస్తామని నోరు జారారు. దీంతో ప్రజలు , రైతులు స్వచ్చంధంగా బయటకు వచ్చి నిరసన తెలిపారు. దెబ్బకు సదరు నేతలు నోరు మూసుకున్నారని సెటైర్ వేశారు. 24 గంటల విద్యుత్ ఉంటే రైతులు తమకు ఇష్టం వచ్చినప్పుడు సాగు చేసుకునేందుకు వీలుంటుందన్నారు కేసీఆర్.
Also Read : Vijay Sai Reddy : పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,911 కోట్లు