CM KCR BRS : కాషాయం ఖ‌తం ‘గులాబీ’ ఎగ‌ర‌డం ఖాయం

బీఆర్ఎస్ ఆవిష్క‌ర‌ణ స‌భ‌లో సీఎం కేసీఆర్

CM KCR BRS : తెలంగాణ సీఎం కేసీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక నుంచి కాషాయం ఖ‌తం కావ‌డం ఖాయ‌మ‌న్నారు. ఢిల్లీ ఎర్ర‌కోట‌పై గులాబీ జెండా ఎగ‌రడం ఖాయ‌మ‌న్నారు సీఎం. అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్ భార‌త రాష్ట్ర స‌మితి నినాదం అని ప్ర‌క‌టించారు. ఈనెల 14న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆఫీసును ప్రారంభిస్తామ‌ని చెప్పారు.

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఓకే చెప్పింది. ఈ మేర‌కు అనుమ‌తి ఇస్తూ కేసీఆర్ కు లేఖ రాసింది. దీంతో శుక్ర‌వారం సంబురాలు మిన్నంటాయి. భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. బీఆర్ఎస్ ఆవిర్బావ వేడుక‌లు తెలంగాణ భ‌వ‌న్ లో అట్ట‌హాసంగా జ‌రిగాయి.

అనంత‌రం సీఎం కేసీఆర్(CM KCR BRS) అధ్య‌క్ష‌త‌న పార్టీ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశ ప‌రివ‌ర్త‌న కోస‌మే భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ ఏర్ప‌డింద‌న్నారు కేసీఆర్. ఎన్నిక‌ల్లో గెల‌వాల్సింది ప్ర‌జ‌లేన‌ని కానీ పార్టీలు కాద‌న్నారు సీఎం. ఈ దేశానికి ఇప్పుడున్న ఆర్థిక వ్య‌వ‌స్థ కాద‌న్నారు.

కొత్త ఆర్థిక వ్య‌వ‌స్థ రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు కేసీఆర్. జాతీయ స్థాయిలో కొత్త ప‌ర్యావ‌ర‌ణ విధానం కావాల‌న్నారు. మ‌హిళా జాతీయ విధానం అమ‌లు చేయాలని డిమాండ్ చేశారు. త్వ‌ర‌లోనే పార్టీకి సంబంధించిన పాల‌సీలు రూపొందిస్తామ‌ని చెప్పారు. రైతు పాల‌సీ, జ‌ల విధానం కూడా త‌యారు చేస్తామ‌ని చెప్పారు కేసీఆర్.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ త‌ర‌పున ప్ర‌చారం చేస్తామ‌ని చెప్పారు. కుమార స్వామి మ‌రోసారి సీఎం కావాల‌ని పిలుపునిచ్చారు.

Also Read : బీఆర్ఎస్ కు ఈసీ లైన్ క్లియ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!