CM KCR : హైదరాబాద్ – ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ కు జనం చెంప ఛెళ్లుమనిపించారు. 119 సీట్లకు గాను పవర్ లోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. తాను మూడోసారి ముఖ్యమంత్రిగా కావాలని అనుకున్నారు దొర. కానీ ఆయన ఆశలపై నీళ్లు చల్లారు ప్రజలు. మొత్తంగా అహంకారాన్ని పక్కన పెట్టారు. ఆత్మ గౌరవానికి పెద్ద పీట వేశారు.
CM KCR Feels
తాను కలలో కూడా అనుకోలేదు కేసీఆర్(CM KCR) ఓడి పోతానని. ఆయనకు ఈ ఎన్నికలు ఎళ్లకాలం దొరకు గుర్తుండి ఉండిపోతాయి. ఆనాటి దొరల పాలనను, నిజాం నవాబును గుర్తుకు తెచ్చారు. రాజ్యాంగం ప్రకారం ఓడి పోయాక సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి స్వయంగా, వ్యక్తిగతంగా గవర్నర్ ను కలుసుకుని తన రాజీనామా పత్రం ఇవ్వాల్సి ఉంటుంది.
కానీ మరోసారి తన అహంకార పూరిత ధోరణిని ప్రదర్శించారు. ఏ గవర్నర్ నైతే నోటికి వచ్చినట్లు మాట్లాడాడో, దూషించారో, ఒక మహిళ అన్న గౌరవం లేకుండా ఇబ్బందులకు గురి చేశారో తెలంగాణ సమాజం ప్రత్యక్షంగా చూసింది. చివరకు తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు ఇవ్వకుండా ఓఎస్డీ ద్వారా పంపించారు. ఉన్నట్టుండి చెప్పా చేయకుండా ఫామ్ హౌస్ కు చెక్కేశారు కేసీఆర్.
Also Read : Telangana Governer : కేసీఆర్ రాజీనామా ఆమోదం