CM KCR : బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడనం వాయు గుండంగా మారింది. దీంతో పెద్ద ఎత్తున వర్షాలు కుండ పోతగా కురుస్తున్నాయి. వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండు కుండల్ని తలపింప చేస్తున్నాయి.
CM KCR Orders
తెలంగాణలో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే పలు చోట్ల వంతెనలు డ్యామేజ్ అయ్యాయి. పలువురు గల్లంతయ్యారు. గ్రామాలు నీళ్లల్లో చిక్కుకున్నాయి. దీంతో సీఎం కేసీఆర్(KCR) యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు సీఎం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్రంలోని వరద బాధిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.
సహాయక చర్యలు చేపట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్, అగ్ని మాపక దళాలు. హెలికాప్టర్ల ద్వారా వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చడంలో సక్సెస్ అయ్యారు.
అతి భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. ఉన్నతాధికారులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో ఉండాలని స్పష్టం చేశారు సీఎం. ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు. ప్రాజెక్టుల వద్దే ఉండాలని , ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Also Read : Smriti Irani : రాహుల్ పై భగ్గుమన్న స్మృతీ ఇరానీ