CM KCR : అకాల వర్షం కేసీఆర్ అభయ హస్తం
పంట నష్టం అంచనా వేయండి
CM KCR : ప్రకృతి కన్నెర్ర చేయడంతో అన్నదాతలు తీవ్ర నష్టానికి గురయ్యారు. ఎండా కాలం సమయంలో ఉన్నట్టుండి అనుకోకుండా భారీ వర్షాలు వెంటాడాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలన్నీ కళ్ల ముందే నాశనం కావడంతో లబోదిబో మంటున్నారు రైతులు. విషయం తెలుసుకున్న వెంటనే తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(CM KCR) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ మేరకు సీఎస్ శాంతి కుమారితో సమీక్ష చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలకు తీవ్రంగా నష్ట పోయారు రైతులు. అన్ని జిల్లాల్లో పంట నష్టం అంచనా వేయాలని సీఎస్ ను ఆదేశించారు సీఎం కేసీఆర్(CM KCR). ఏయే ప్రాంతాలలో ఎన్ని పంటలు నష్టానికి గురయ్యాయో పూర్తి వివరాలు తనకు అందజేయాలని స్పష్టం చేశారు.
అనుకోకుండా వచ్చిన వర్షాలు మరోసారి రైతులను కన్నీటి పాలయ్యేలా చేశాయి. చేతికి వచ్చిన పంటలన్నీ నేల పాలయ్యాయి. పెద్ద ఎత్తున వడగండ్లు , ఈదురుగాలలతో పంటలను నాశనం చేశాయి. ఇక పంటలు కోసి కల్లాల్లో , కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వడ్లు, ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. భారీ ఎత్తున కురిసిన వర్షాలకు కొట్టుకు పోయాయి. దీంతో రైతులు కన్నీటి పర్యంతం అయ్యాయి.
ఇదిలా ఉండగా పంటలు నష్ట పోయిన రైతులకు భరోసా ఇచ్చారు సీఎం కేసీఆర్. ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు.
Also Read : విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కొనేందుకు రెడీ