CM KCR : 16న జ‌న‌గ‌ణ‌మ‌న గీతాలాప‌న – కేసీఆర్

తెలంగాణ వ్యాప్తంగా అమ‌లు చేయాలి

CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు ఆగ‌స్టు 16న ప్ర‌తి ఒక్క‌రు జాతీయ గీతం జ‌న‌గ‌ణ‌మ‌న గీతాన్ని ప్ర‌తి ఒక్క‌రు ఆలాపించాల‌ని పిలుపునిచ్చారు.

ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ సంద‌ర్భంగా 15 రోజుల పాటు ఉత్సవాలు నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. రాష్ట్ర‌మంతటా ఏక కాలంలో తెలాంగ‌ణ రాష్ట్ర సామూహిక జాతీయ గీతాలాప‌న నిర్వ‌హించాల‌న్నారు.

ఎక్క‌డి వాళ్లు అక్క‌డ ఇందులో పాల్గొనాల‌ని సూచించారు. అంతే కాకుండా 21న ప్ర‌త్యేక అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని, మండ‌ల‌, గ్రామ‌, జిల్లా ప‌రిష‌త్ , మున్సిపాలిటీలు, అన్ని ర‌కాల స్థానిక సంస్థ‌ల ప్ర‌త్యేక స‌మావేశాలు చేప‌ట్టాల‌ని ఆదేశించారు సీఎం.

స్వాతంత్ర పోరాట వీరుల‌కు నివాళులు అర్పించాల‌న్నారు. ఆగ‌స్టు 8 నుంచి 22 దాకా స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ ద్విస‌ప్తాహం కార్య‌క్ర‌మంపై కేసీఆర్(CM KCR) స‌మీక్ష చేప‌ట్టారు.

విద్యార్థులు, టీచ‌ర్లు, ఉద్యోగులు, ఉన్నాతాధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులు , యావ‌త్ యువ‌త తో పాటు తెలంగాణ స‌మాజం మొత్తం ఇందులో పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు.

ఈనెల 15న ఇంటింటిపై జాతీయ జెండాను ఎగుర వేయాల‌న్నారు. ఇందుకు సంబంధించి ఒక కోటి 20 ల‌క్ష‌ల ఇళ్ల‌కు జాతీయ జెండాల‌ను ఉచితంగా పంపిణీ చేయాల‌ని ఆదేశించారు సీఎం.

ఈనెల 9 నుంచి వీటిని ఇవ్వాల‌న్నారు. రాష్ట్రంలోని అన్ని థియేట‌ర్ల‌లో గాంధీ సినిమాను ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ విద్యా సంస్థ‌ల‌కు ప్ర‌తి రోజూ ప్ర‌ద‌ర్శించాల‌న్నారు.

క‌వి స‌మ్మేళ‌నాలు, ముషాయిరాలు, సంగీత విభావ‌రీలు చేప‌ట్టాల‌న్నారు సీఎం. జిల్లాకో ఉత్త‌మ గ్రామ పంచాయ‌తీ, మున్సిపాలిటీ, పాఠ‌శాల‌, రైతు, డాక్ట‌ర్, ఇంజ‌నీర్, ప‌లీస్, క‌ళాకార‌డుఉ, గాయ‌కుడు, క‌వి, జ‌ర్న‌లిస్ట్ ల‌ను గుర్తించాల‌ని ఆదేశించారు.

Also Read : కేసీఆర్ అవినీతిలో అన‌కొండ

Leave A Reply

Your Email Id will not be published!