CM KCR : తెలంగాణలో పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 60 శాతానికి చేరుకుంది పోలింగ్. రాష్ట్రానికి సంబంధించి పలువురు ప్రముఖ నేతలు ఓటు వేశారు. బీఆర్ఎస్ బాస్ , ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఓటు వినియోగించుకున్నారు.
CM KCR Winning Movement
ఇక చింతమడకలో బీఆర్ఎస్ బాస్ , ముఖ్యమంత్రి కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా భారీ భద్రత కల్పించారు. కేసీఆర్(CM KCR) ను కలిసేందుకు , ఆయనను తాకేందుకు ఓటర్లు గుమి గూడారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందు వల్ల వారిని దూరంగా ఉంచారు. కేసీఆర్ దంపతుల వెంట ఆర్థిక మంత్రి హరీశ్ రావు కూడా ఉన్నారు.
ఈ సందర్బంగా కేసీఆర్ విక్టరీ సింబల్ ను చూపిస్తూ వెళ్లి పోయారు. మూడోసారి పక్కా సీఎం అవుతానని , హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇక కేటీఆర్ జూబ్లీ హిల్స్ లో ఓటు వేశారు. తన సతీమణితో కలిసి వచ్చారు.
హరీశ్ రావు తనతో పాటు భార్య కూడా ఓటు వేశారు.ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మహమ్మద్ అజహరుద్దీన్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ ఆయన సతీమణి, పవన్ కళ్యాణ్ , శేఖర్ కమ్ముల, తేజ, రాజేంద్ర ప్రసాద్ , అల్లు అర్జున్ , అల్లు అరవింద్ , రవితేజ, విక్టరీ వెంకటేశ్ , తదితరులు ఓటు వేశారు.
Also Read : Bhatti Vikramarka : ప్రజా తీర్పు మా వైపే – భట్టి