CM KCR : జడ్చర్ల – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్య అతిథిగా పాల్గొని సీఎం ప్రసంగించారు. ప్రస్తుతం ఆవంచ లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఉద్యమం ముందు నుంచీ కష్టపడి పని చేస్తూ వచ్చాడని కితాబు ఇచ్చారు. తాను తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన సమయంలో తను కూడా పదవికి గుడ్ బై చెప్పాడని ప్రశంసించారు.
CM KCR Comments Viral
ఉద్యమం నుంచి నేటి దాకా ఎక్కడికీ వెళ్లలేదు. తన వెంట నడిచాడని, తన కోసం అహర్నిశలు ఏది చెప్పినా చేస్తున్నాడని అన్నారు. పిలిస్తే పలికే నాయకుడిగా లక్ష్మారెడ్డికి పేరుందన్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటాడని, నిరంతరం మీ మధ్యనే ఉంటూ ప్రజా సేవలో నిమగ్నం అయ్యాడని కొనియాడారు.
ఇలాంటి నాయకుడిని భారీ మెజారిటీతో ఈసారి ఎన్నికల్లో గెలిపించాలని, గులాబీ జెండాను మరోసారి జడ్చర్లలో ఎగుర వేయాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్(CM KCR). ఆయన గెలుపు ఖాయమై పోయిందన్నారు. లక్ష్మారెడ్డిని ఢీకొనే మొనగాడు ఇక్కడ ఎవరూ లేరన్నారు. ఇప్పటికే లక్ష్మారెడ్డి గెలిచాడని ఇక మిగిలింది భారీ మెజారిటీనేనని పేర్కొన్నారు . దాని కోసం తాను ఎదురు చూస్తున్నానని చెప్పారు కేసీఆర్.
Also Read : Minister KTR : ప్రవల్లిక కుటుంబాన్ని ఆదుకుంటాం