CM KCR : వైద్య రంగానికి అధిక ప్రాధాన్య‌త

స్ప‌ష్టం చేసిన సీఎం కేసీఆర్

CM KCR : తెలంగాణ‌లో వైద్య రంగానికి ప్ర‌యారిటీ ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు సీఎం కేసీఆర్. వైద్య రంగంపై ప్లాన్ చేశామ‌న్నారు. భారీ ఎత్తున ఈ రంగానికి భారీ ఎత్తున నిధులు మంజూరు చేశామ‌ని వెల్ల‌డించారు. గ‌తంలో పాల‌కులు ఈ రంగాన్ని నిర్వీర్యం చేశార‌ని వాపోయారు. 2014లో రూ. 2001 కోట్లు కేటాయిస్తే ఇవాళ 2023-24లో రూ. 12,367 కోట్లకు చేరింద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇవాళ గ‌తంలో లేనంత‌గా ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలిపారు. దేశాన్ని, ప్ర‌పంచాన్ని తీవ్ర ప్ర‌భావం చూపిన క‌రోనా స‌మ‌యంలో సైతం తెలంగాణ అద్భుతంగా క‌ట్ట‌డి చేయ‌గిలింద‌న్నారు సీఎం కేసీఆర్(CM KCR). ఇదే స‌మ‌యంలో యావ‌త్ ప్ర‌పంచానికి క‌రోనా నియంత్ర‌ణ కోసం హైద‌రాబాద్ నుంచి వ్యాక్సిన్లు త‌యారు చేసిన ఘ‌న‌త త‌మ‌దేన‌న్నారు .

బుధ‌వారం హైద‌రాబాద్ లో నిమ్స్ ద‌శాబ్ది బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు సీఎం కేసీఆర్. రాబోయే రోజుల్లో మ‌రికొన్ని వైర‌స్ లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించారు. వీటిని నియంత్రించేందుకు వైద్య రంగం కృషి చేయాల‌ని ఆదేశించారు. తమ ప్ర‌భుత్వం దీనిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టామ‌ని సీఎం కేసీఆర్ చెప్పారు. పిల్ల‌ల్లో ఎదుగుద‌ల కోసం న్యూట్రిష‌న్ కిట్లు ఇస్తున్న‌ట్లు చెప్పారు. వీటిని వాడ‌డం వ‌ల్ల రాబోయే కొన్ని త‌రాలు బాగు ప‌డ‌తాయ‌ని స్ప‌ష్టం చేశారు.

గ‌తంలో ప్ర‌స‌వాలు 30 శాతం జ‌రిగితే తాము తీసుకు వ‌చ్చిన వ‌స‌తి సౌక‌ర్యాల కార‌ణంగా అవి 70 శాతానికి పెరిగాయ‌ని స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్ లో నాలుగు ఆస్ప‌త్రులు క‌డుతున్నామ‌ని వెల్ల‌డించారు.

Also Read : Sree Leela Allu ArjunViral : బ‌న్నీతో శ్రీ‌లీల చిత్రం

Leave A Reply

Your Email Id will not be published!