CM KCR : రూ. 100 కోట్ల ధర పలకడం అభివృద్దికి చిహ్నం
సర్కార్ పరపతికి దక్కిన గౌరవమన్న సీఎం
CM KCR : తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అరుదైన రికార్డ్ నమోదైంది. ప్రభుత్వం వేలం పాట చేపట్టింది. హైదరాబాద్ భూములు ఎకరాకు రూ.100 కోట్లకు పైగా ధర పలకడం విస్తు పోయేలా చేసింది. ఇది తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం పడుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు పోటీ పడి మరీ ఇంత భారీ ధర చెల్లించి భూములు కొనుగోలు చేయడాన్ని ఆర్థిక కోణంలో మాత్రమే కాకుండా తెలంగాణ సాధించిన ప్రగతి కోణంలో చూడాలని, ప్రత్యేకించి విశ్లేషించాలని పేర్కొన్నారు సీఎం.
CM KCR Comments
ఇంతింతై వటుడింతై అన్నట్లు హైదరాబాద్ నగర అభివృద్ది సూచిక అందనంత ఎత్తుకు దూసుకు పోతోందని, వర్తమాన పరిస్థితికి అద్దం పడుతుందని కేసీఆర్(CM KCR) అన్నారు. తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగం అవుతుందని, భూముల ధరలు భారీగా పడి పోతాయని దుష్ప్రచారం చేశారని కానీ ఊహించని రీతిలో ఇవాళ రికార్డు స్థాయిలో ధర పలకడం అభివృద్దికి చిహ్నమని పేర్కొన్నారు.
ఎవరు ఎంతగా నష్టం చేయాలని చూసినా ధృఢ చిత్తంతో పల్లెలను, పట్టణాలను ప్రగతి పథంలో నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలకు , హైదరాబాద్ వంటి మహా నగరాన్ని విశ్వ నగరంగా తీర్చి దిద్దేందుకు సర్కార్ చేసిన కృషికి దక్కిన ఫలితమన్నారు.
Also Read : Mahua Moitra : మణిపూర్ పై ఇకనైనా నోరు విప్పండి
