CM KCR : దోపిడి నిజం అభివృద్ది వాస్తవం – కేసీఆర్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ కామెంట్
CM KCR : రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకు వచ్చిన . ఎందరో రాష్ట్రం కోసం శ్రమించారు. వారందరి త్యాగ ఫలమే నేటి తెలంగాణ . ఊరికే రాలేదు. కొట్లాడితే వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ దిక్కులేనిదైంది. ఆగమాగమైంది. ఏపీ ఏర్పడిన నాటి నుంచే దోపిడీ మొదలైంది. అందుకే తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. 1969లో నిప్పు రవ్వగా మారింది. అది మహా అగ్ని పర్వతంలా పెల్లుబికింది. మలి దశ పోరాటంగా రూపుదిద్దుకుంది. ఇందులో నేను ప్రత్యక్షంగా పాల్గొన్నా. ముందుండి నడిపించాను. సకల జనులు , సంబండ వర్ణాలు, చిన్నారుల నుంచి పెద్దల దాకా యువకుల నుంచి పండు ముదుసలి వరకు సమిష్టిగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం జరిగిన అలుపెరుగని పోరులో పాలు పంచుకున్నారు.
గత్యంతరం లేక కేంద్రం దిగి వచ్చింది. చావు నోట్లో తలకాయ పెట్టిన తిరిగి వచ్చిన. చివరకు రాష్ట్రం వచ్చినంకనే హైదరాబాద్ లో అడుగు పెడతానని చెప్పిన. చేసి చూపించిన. ఇదీ కేసీఆర్ సత్తా అంటే ఏమిటో తెలిసిందన్నారు. సరిగ్గా ఇదే రోజు జూన్ 2న 2014లో తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పాటైంది. ఇవాల్టితో తొమ్మిదేళ్లు పూర్తయినవి అన్నారు. సీఎం కేసీఆర్(CM KCR). తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా సచివాలయంలో జెండా ఎగుర వేశారు. ఈ సందర్బంగా ప్రసంగించారు.
రాష్ట్రం ఏర్పడిన సమయంలో తెలంగాణ పరిస్థితి దారుణంగా ఉండేది. కానీ తాను వచ్చాక పాలన రాదన్నారు. కానీ ఏపీ తల దించుకునేలా, దేశం నివ్వెర పోయేలా పాలన సాగిస్తున్నానని చెప్పారు. సమృద్దిగా నీళ్లు, ప్రాజెక్టులు ఏర్పాటు చేశామన్నారు. అన్ని వర్గాలకు అండగా ఉన్నామని చెప్పారు కేసీఆర్.
Also Read : Telangana Formation