CM KCR : నిరంత‌ర పోరాటం, ఒంట‌రిగా లేం – కేసీఆర్

తెలంగాణ సీఎం సంచ‌ల‌న కామెంట్స్

CM KCR : మేం ఎవ‌రి వైపు లేము. మేం ఒంట‌రిగా పోరాటం చేస్తూనే ఉంటాం. మాది ధ‌ర్మ‌మైన పంథా. ఇందులో ఎవ‌రైనా రావ‌చ్చు లేదా పోవ‌చ్చు. కానీ ఒక‌రి కోసం వేచి చూడాల్సిన అవ‌స‌రం మాకు లేదు. మేం అత్యంత బ‌లంగా ఉన్నాం. అంత‌కు మించి స్ప‌ష్ట‌త‌తో ఉన్నామ‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్.

CM KCR Comments

మ‌హారాష్ట్ర‌లో కేసీఆర్ ప‌ర్య‌టించారు. ఆయ‌న రాష్ట్రంలో ప్ర‌సిద్ది చెందిన కొల్హాపూర్ లోని మ‌హాల‌క్ష్మి (మాతా అంబా బాయి) ఆల‌యాన్ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా అమ్మ వారికి పూజ‌లు చేశారు. అనంత‌రం కేసీఆర్(KCR) ను వివిధ పార్టీల‌కు చెందిన నాయ‌కులు క‌లిశారు. త‌మ స‌మ్మ‌తిని తెలిపారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.

మీరు ఎవ‌రి వైపు ఉన్నార‌ని వేసిన ప్ర‌శ్న‌కు కేసీఆర్ ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం ఇచ్చారు. తాము ఎవ‌రి ప‌క్షం ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. బీఆర్ఎస్ వైపు చాలా పార్టీలు చూస్తున్నాయ‌ని, మ‌రికొంద‌రు నేత‌లు త‌మ‌తో క‌లిసి న‌డ‌వాల‌ని కోరిన‌ట్లు కూడా కేసీఆర్ చెప్పారు. ఈ దేశాన్ని కాంగ్రెస్ 50 ఏళ్ల పాటు పాలించింది. ఏం ఒర‌గ బెట్టిందంటూ ప్ర‌శ్నించారు. మ‌రో వైపు ఎన్డీఏ పాలించింది దాని వ‌ల్ల దేశానికి జ‌రిగిన మేలు ఏమిటో చెప్పాల‌న్నారు కేసీఆర్.

Also Read : IND vs WI 3rd ODI : విండీస్ పై విక్ట‌రీ భార‌త్ దే సీరీస్

Leave A Reply

Your Email Id will not be published!