CM KCR : సీఎం రెండో విడ‌త ప్ర‌చారం

మ‌రోసారి ఎన్నిక‌ల‌పై ఫోక‌స్

CM KCR : తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఎలాగైనా హ్యాట్రిక్ విజ‌యం సాధించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్. ఈ మేర‌కు భారీ ఎత్తున క‌స‌ర‌త్తు స్టార్ట్ చేశారు. మొత్తం 119 నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి 115 సీట్ల‌ను ఖ‌రారు చేశారు. మ‌రికొన్ని సీట్ల‌ను ఎంఐఎంకు ఇచ్చారు. గ‌త నెల 15 నుంచి ఎన్నిక‌ల ప్ర‌చారానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్.

CM KCR Campaign Updates

ఇదే స‌మ‌యంలో మొత్తం అభ్య‌ర్థుల‌కు బీ ఫార‌మ్ లు ఇచ్చారు. చాలా మ‌టుకు సిట్టింగ్ ల‌కే కేటాయించారు. కొన్నిచోట్ల మార్చారు అభ్య‌ర్థుల‌ను. విస్తృతంగా విజ‌య భేరియాత్ర పేరుతో బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగే ప్ర‌చార స‌భ‌ల్లో పాల్గొన్నారు.

తొలి విడ‌త ప్ర‌చారంలో భాగంగా విస్తృతంగా ప‌ర్య‌టించారు. ఉమ్మ‌డి పాల‌మూరు, రంగారెడ్డి, న‌ల్ల‌గొండ‌, మెద‌క్, ఖ‌మ్మం, ఆదిలాబాద్, వ‌రంగ‌ల్ జిల్లాల‌లో ప‌ర్య‌టించారు. అంత‌కు ముందు ముహూర్తం బాగుంద‌ని ఈనెల 9న గ‌జ్వేల్ లో ఉద‌యం , మ‌ధ్యాహ్నం కామారెడ్డిలో నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. ఈసారి విచిత్రంగా కేసీఆర్(CM KCR) రెండు చోట్ల పోటీలో నిల్చుండ‌డం విశేషం.

దీపావ‌ళి పండుగ రావ‌డంతో సీఎం కేసీఆర్ రెండో విడ‌త ప్ర‌చారాన్ని సోమ‌వారం నుంచి ప్రారంభించ‌నున్నారు. నవంబ‌ర్ 30న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈనెల 28 , 29, 30 ల‌లో పూర్తిగా మ‌ద్యం షాపుల‌ను బంద్ చేయాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది.

Also Read : Eatala Rajender : కేసీఆర్ కు ఓట‌మి భ‌యం

Leave A Reply

Your Email Id will not be published!