CM KCR Bandi Revanth : కూల్చేస్తే కాళ్లు..చేతులు విరిచేస్తాం
బండి సంజయ్..రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్
CM KCR Bandi Revanth : గతంలో ఎన్నడూ లేనీ రీతిలో సీఎం కేసీఆర్ రెచ్చి పోయారు. శాసన సభా వేదికగా ప్రసంగించిన సీఎం నిప్పులు చెరిగారు. గత కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ పటేల్ , తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లు సంచలన ఆరోపణలు చేశారు. బండి సంజయ్(Bandi Sanjay) కొత్తగా పునర్ నిర్మించిన తెలంగాణ సచివాలయాన్ని కూల్చి వేస్తామని, తాము అధికారంలోకి వచ్చాక మొదటి పని అదే చేస్తామని ప్రకటించారు.
ఇక రేవంత్ రెడ్డి తాము పవర్ లోకి రావడం ఖాయమని ప్రగతి భవన్ ను గ్రెనేడ్లతో ధ్వంసం చేస్తామని అన్నారు. ఇద్దరూ బహిరంగ వేదికలపై షాకింగ్ కామెంట్స్ చేయడంతో భారత రాష్ట్ర సమితి తీవ్రంగా అభ్యంతరం చెప్పింది. ఈ తరుణంలో అసెంబ్లీలో సీఎం కేసీఆర్ బండి సంజయ్ , రేవంత్ రెడ్డిలను టార్గెట్ చేశారు. వారిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూనే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎవరైనా సరే సచివాలయాన్ని, ప్రగతి భవన్ దరి దాపుల్లోకి వస్తే నడ్డి విరుస్తామని అన్నారు.
కాళ్లు, చేతులు విరిచేసి కూర్చో బెడతామని హెచ్చరించారు. కూల్చేసే దమ్ముంటే ముందుకు రావాలని సవాల్ విసిరారు. ఇక్కడ ఎవరూ ఖాళీగా కూర్చోలేదన్నారు సీఎం కేసీఆర్. బాధ్యత కలిగిన నాయకులై ఉండి ఇలా ఉగ్రవాదుల్లాగా మాట్లాడుతారా అంటూ ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఓపిక పట్టానని ఇక నుంచి ఉపేక్షించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్(CM KCR).
Also Read : కేసీఆర్ నోట ఈటల మాట