CM KCR : అడ్డ‌గోలు ప్రైవేటీక‌రణ‌పై ఆగ్ర‌హం

నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్

CM KCR : ఈ దేశంలో ఏం జ‌రుగుతుందో తెలియ‌డం లేదు. కానీ ఇంత కాలం కాపాడుకుంటూ వ‌చ్చిన ప్ర‌భుత్వ ఆస్తుల‌ను గంప గుత్త‌గా ప్రైవేటీక‌ర‌ణ చేసుకుంటూ పోతున్నారు. ఇదెక్క‌డి న్యాయం. ఇదేనా మోదీ(PM Modi) పాల‌న అంటూ నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. ఆదివారంతో తెలంగాణ రాష్ట్ర శాస‌న స‌భ స‌మావేశాలు ముగిశాయి. ఈ సంద‌ర్భంగా సీఎం ప్ర‌సంగించారు. అడ్డ‌గోలుగా ప్రైవేట్ ప‌రం చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు కేసీఆర్. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని ఆరోపించారు.

కీల‌క‌మైన ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను నిర్వీర్యం చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. ఇందు కోస‌మేనా మిమ్మ‌ల్ని గెలిపించిందంటూ ప్ర‌శ్నించారు. మోదీ చేస్తున్న అరాచ‌క పాల‌న‌ను చూసి త‌ట్టుకోలేకే తాను భార‌త రాష్ట్ర స‌మితిని ఏర్పాటు చేశాన‌ని చెప్పారు కేసీఆర్. ఒక ప్లాన్ అంటూ లేకుండా అడ్డ‌గోలుగా ప‌రిపాల‌న సాగించ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని హిత‌వు ప‌లికారు సీఎం(CM KCR).

5 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఎకాన‌మీ అని గొప్ప‌గా చెప్పారు. కానీ ఆ దిశ‌గా ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది ఏమీ లేద‌న్నారు. చైనా ఎకాన‌మీ 18.3 ట్రిలియ‌న్స్ , జ‌పాన్ 4.3 ట్రిలియ‌న్స్ ,జ‌ర్మ‌నీ 4 ట్రిలియ‌న్స్ , ఇండియా వ‌ర‌కు 3.3 ట్రిలియ‌న్ వ‌ద్ద ఉండ‌డం సిగ్గు చేటు అన్నారు కేసీఆర్. ఇండియా ర్యాంకు 139వ స్థానంలో ఉంద‌న్నారు. కానీ మ‌న‌కంటే చిన్న దేశాలు టాప్ లో ఉన్నాయ‌న్నారు.

ఎంపీలు మాట్లాడ‌కుండా అడ్డు కోవ‌డం ఏం సంస్కార‌మ‌ని నిల‌దీశారు కేసీఆర్. బీబీసీ ఛాన‌ల్ పై కోర్టుకు ఎక్క‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఇదేనా మ‌న సంస్కృతి అని మండిప‌డ్డారు.

Also Read : మోదీ ఎకాన‌మీ బ‌క్వాస్ – సీఎం కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!