CM KCR Skipped : కేసీఆర్ కు ఆహ్వానం అయినా దూరం
ప్రధాని మోదీ పర్యటనకు కేసీఆర్ డుమ్మా
CM KCR Skipped : తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఝలక్ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసేందుకు హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం సీఎం హాజరు కావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ స్వాగతం పలికారు.
ప్రోటోకాల్ ప్రకారం ఇప్పటికే సీఎం కేసీఆర్ కు(CM KCR Skipped) ఆహ్వానం కూడా పంపించారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఆయనకు ప్రత్యేకంగా కుర్చీ కూడా వేశారు. కానీ ఉన్నట్టుండి సీఎం హాజరు కాలేదు. ప్రధాని కార్యక్రమాలకు దూరంగా ఉండడంపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా తప్పు పట్టింది. రాజకీయాలకు అతీతంగా అభివృద్ది పనుల విషయంలో హాజరు కావాల్సిన సీఎం ఇలా చేయడం ఏమిటి అని ప్రశ్నించారు. గతంలో కూడా పీఎం హాజరైనా కేసీఆర్ హాజరు కాలేదు.
తెలంగాణలో ఎన్నికల్లో దూసుకు పోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీతో కేసీఆర్ కి చెందిన భారత రాష్ట్ర సమితి విభేదిస్తోంది. రాష్ట్రంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరో వైపు జాతీయ ఆశయాల్లో భాగంగా పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించే ప్లాన్ లో ఉన్నారు కేసీఆర్.
రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేశారు . బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలతో కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఇక పీఎం టూర్ సందర్భంగా తెలంగాణలో రూ. 11,300 కోట్ల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
Also Read : ఎట్టకేలకు అభివృద్ది పనులకు మోక్షం