CM KCR : బీఆర్ఎస్ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా బీజేపీ బరిలో ఉన్నప్పటికీ ఆ పార్టీని పట్టించు కోవడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు నిజం అయ్యేలా ఉన్నాయి. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలన్నీ ఒక్కటేనని. దీనిని నిజం చేస్తూ మాటలతో మంటలు రేపుతున్నారు కేసీఆర్.
CM KCR Serious Comments on Congress
50 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు కేసీఆర్(CM KCR). మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం నిప్పులు చెరిగారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో తొలిసారిగా రైతు బంధును ప్రవేశ పెట్టిన ఘనత తనదేనని పేర్కొన్నారు కేసీఆర్.
రైతులు తమ బొటన వేలు పెడితేనే భూమి మారుతుందన్నారు. లేకపోతే ఏం చేసినా మారదన్నారు సీఎం. తాను బటన్ నొక్కితే నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోందన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉద్యమ కారుడిగా ఉన్నారు. ఉద్యోగ సంఘాలకు ప్రతినిధిగా కీలక పాత్ర పోషించాడంటూ కితాబు ఇచ్చారు.
గతంలో పాలకులు ప్రజల బాగోగుల గురించి పట్టించు కోలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ పేరుతో వచ్చిన తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ది జరిగిందని స్పష్టం చేశారు కేసీఆర్. ఓటు విలువైనదని దానిని జాగ్రత్తగా ఉపయోగించు కోవాలని పిలుపునిచ్చారు.
Also Read : Mohammed Azharuddin : ప్రచారంలో అజ్జూ భాయ్ దూకుడు