CM KCR : కాంగ్రెస్ నిర్వాకం కేసీఆర్ ఆగ్రహం
తెలంగాణ సీఎం కేసీఆర్
CM KCR : తెలంగాణ – కాంగ్రెస్ పార్టీ నిర్వాకం కారణంగానే డబ్బులు ఉన్నా రైతులకు ఇవ్వలేక పోతున్నామని సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ బాస్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సంచలన కామెంట్స్ చేయడం కలకలం రేపింది. ఇప్పటికే తమ పార్టీకి చెందిన కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దీనికి కాంగ్రెస్ పార్టీనే కారణమంటూ ఆరోపించారు.
CM KCR Slams Congress
తాజాగా మరోసారి రెచ్చి పోయారు. ఆయన బీజేపీ కంటే కాంగ్రెస్ నే ఎక్కువగా టార్గెట్ చేయడం విస్తు పోయేలా చేస్తోంది. ఎన్నికల కోడ్ రావడంతో తాము రైతులకు సంబంధించి రుణ మాఫీ డబ్బులను ఇవ్వలేక పోతున్నామని స్పష్టం చేశారు. కావాలని తాము ఆపలేదన్నారు.
ఒకవేళ మానవతా దృక్ఫథంతో ఎన్నికల సంఘం అనుమతి ఇస్తే వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు కేసీఆర్(CM KCR). ఎన్నికల సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ నాయకులు కావాలని ఫిర్యాదు చేశారని, దాని వల్లనే డబ్బులు ఆగి పోయాయని ఆరోపించారు కేసీఆర్.
ఇదిలా ఉండగా కేసీఆర్ చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండి పడింది.
Also Read : Chandrababu Case : బాబుకు షాక్ మరో కేసు నమోదు