CM KCR : ఖానాపూర్ – బీఆర్ఎస్ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కష్టాలు మాత్రం గ్యారెంటీగా వస్తాయని ఎద్దేవా చేశారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖానాపూర్ లో జరిగిన బీఆర్ఎస్ సభలో పాల్గొని ప్రసంగించారు కేసీఆర్.
CM KCR Comments on Congress
పొరపాటున కాంగ్రెస్ కు ఓటు వేస్తే నాశనమేనని హెచ్చరించారు. 24 గంటల కరెంట్ తీసేసి కేవలం 3 గంటలు మాత్రమే ఇస్తానంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటున్నాడని , ఇకనైనా ఆలోచించి విజ్ఞతతో ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
ఓటు వజ్రాయుధమని దానిని సరైన పార్టీకి, అభివృద్ది కోసం కృషి చేస్తున్న నాయకులకు వేయాలని సూచించారు కేసీఆర్(CM KCR). దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. తాను తీసుకు వచ్చిన ఈ పథకం ఇవాళ దేశానికి ఆదర్శ ప్రాయంగా మారిందన్నారు.
ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను బురిడీ కొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు కేసీఆర్.
తాము తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. దళిత బంధు, బీసీ బంధు , కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు తమను గట్టెక్కిస్తాయని అన్నారు కేసీఆర్.
Also Read : Revanth Reddy : సీఎం ఫామ్ హౌస్ కు పరిమితం ఖాయం