CM KCR : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసోళ్లు సోయి లేనోళ్లంటూ ఎద్దేవా చేశారు. తాను ఒక్కడినే పోరు చేసిన నాడు ఈనాడు ప్రగల్భాలు పలుకుతున్న వాళ్లంతా ఎక్కడున్నారని ప్రశ్నించారు . ఎన్నికల ప్రచారంలో భాగంగా సీరియస్ అయ్యారు. తాను కష్టపడి తెలంగాణను ఒక తోవకు తీసుకు వచ్చానని కానీ ఇవాళ ఢిల్లీ గద్దలన్నీ ఇక్కడ వాలేందుకు ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.
CM KCR Serious Comments
ఇది ఓట్ల పంచాంగం కాదని, ఇది తెలంగాణ బతుకు దెరువుకు సంబంధించిన జీవన్మరణ పోరాటమన్నారు. ఢిల్లీ నుంచి వచ్చే కాంగ్రెస్, బీజేపీ నేతలకు మనపై ఎందుకు ప్రేమ ఉంటుందని ప్రశ్నించారు. పదేళ్ల పాటు నానా తంటాలు పడినం. ఇవాళ కాలువలు, చెరువులు, ప్రాజెక్టులు నీళ్లతో కళకళ లాడుతున్నాయి. దీనికంతటికీ కారణం నేనేనని అన్నారు.
తను గనుక పోరాడి ఉండక పోతే తెలంగాణ వచ్చి ఉండేదా అని నిప్పులు చెరిగారు కేసీఆర్(CM KCR). 50 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ తెలంగాణకు ఏం చేసిందో ఆలోచించాలన్నారు. పాడు పడిన పొలాలు, బీళ్లు బారిన నేలలు, ఎక్కడా చూసినా కరువు , కాటకాలతో నాశనం చేశారని ధ్వజమెత్తారు కేసీఆర్. ఇకనైనా ప్రజలు మేలుకోవాలని లేక పోతే ఇబ్బందులు పడతారంటూ హెచ్చరించారు.
Also Read : TPTF Support : బీఆర్ఎస్ కు ప్రైవేట్ టీచర్స్ ఫోరం సపోర్ట్