CM KCR : గులాబీకి ఓటు అభివృద్దికి మలుపు – కేసీఆర్
కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగిన సీఎం
CM KCR : మునుగోడు ఉప ఎన్నిక ఎవరి కోసం వచ్చిందో మీకందరికి తెలుసు. కోరి తెచ్చుకున్న ఎన్నిక ఇది. అందుకే ప్రతి ఒక్కరు ఓటు ఎవరికి వేస్తున్నామో ఆలోచించు కోవాలి. లేక పోతే ఇబ్బంది తప్పదు. మీ అందరి తలరాతలు మారాలంటే తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.
ఇప్పుడు యుద్దం అవినీతికి అభివృద్దికి మధ్య జరుగుతోందన్నారు. మునుగోడు ఉప ఎన్నికను పురస్కరించుకుని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను గెలిపించాలని మీరంతా అనుకున్నారు. ఎందుకంటే ఇక్కడ బలిసిన వాళ్లు పోటీ చేస్తున్నరు. వారికి బుద్ది చెప్పాలంటే ముందు మీరంతా మీ విలువైన ఓటును పని చేసే అభ్యర్థికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు కేసీఆర్.
ఎన్నికలు వస్తాయి పోతాయి. కానీ శాశ్వతంగా పని చేసే పార్టీని , ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరారు.
తలకు మాసినోళ్లు చెప్పే మాటలను నమ్మవద్దన్నారు. ఓటు అనేది ఆయుధమని మీ భవిష్యత్తును మార్చేందుకు ఉపయోగపడే సాధనమని స్పష్టం చేశారు కేసీఆర్. మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చానని చెప్పారు.
ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదకరంలో పడి పోయిందన్నారు. దేశంలో చైతన్యం రానంత వరకు దుర్మార్గ రాజకీయాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
దోపిడీదారులు మాయ మాటలు చెబుతారని వారి మాటలు గనుక నమ్మితే మోస పోవడం ఖాయమన్నారు సీఎం.
Also Read : మునుగోడులో గెలుస్తం దేశాన్ని ఏలుతం