CM KCR : మోదీపై నిప్పులు చెరిగిన కేసీఆర్
దేశం పట్ల బాధ్యతా రాహిత్యం
CM KCR : సీఎం కేసీఆర్ మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఏకి పారేశారు. దేశం పట్ల ఎలాంటి బాధ్యత లేకుండా పాలన సాగిస్తున్నారంటూ మండిపడ్డారు.
రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న సందర్భంగా ప్రగతి భవన్ లో సమీక్ష చేపట్టారు. కుండ పోత వర్షంతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గాను రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ఇవ్వాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు.
సమీక్ష అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ దేశం ఎటు పోతోందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని జలగల కంటే అధ్వాన్నంగా పీల్చి పిప్పి చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు కేసీఆర్(CM KCR).
బీజేపీకి ప్రధానంగా మోదీకి ఒక విజన్ అంటూ లేదని మండిపడ్డారు. జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో హైదరాబాద్ లో నిర్వహించారు. ఏం చేశారో, ఈ దేశ ప్రజలకు ఏం సందేశం ఇచ్చారో తనకు అర్థం కాలేదన్నారు.
ఇప్పుడేమీ ఎన్నికలు లేవు. అంటే బల ప్రదర్శన కోసం చేశారని అనుకోవాల్సి ఉంటుందన్నారు. ఇలాంటి సభల్ని వేలాదిగా నిర్వహించిన ఘనత ఒక్క టీఆర్ఎస్ కే ఉందన్నారు.
ఉద్యమ సమయంలో లక్షలాది ప్రజల్ని ఒకే ఒక్క పిలుపుతో తరలించిన చరిత్ర తమదన్నారు కేసీఆర్(CM KCR). ప్రధాన మంత్రి ఏం మాట్లాడారో ఆయనకే అర్థం కాలేదన్నారు.
జాతికి ఆయన ఏం సందేశం ఇచ్చారో దాని వల్ల దేశానికి ఎలాంటి ఉపయోగం ఉందో బీజేపీ చెప్పాలన్నారు.
Also Read : ముందస్తు ఎన్నికలకు వెళ్లే దమ్ముందా – కేసీఆర్