CM KCR : దళితబంధు తరహాలో గిరిజనబంధు
రిజర్వేషన్ లో 10 శాతం కోటా పెంపు
CM KCR : సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. గిరిజనులకు శుభవార్త చెప్పారు. ఈ మేరకు 10 శాతం రిజర్వేషన్ కోటాను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని చెప్పారు.
విభజన రాజకీయాలు ప్రారంభించిన అమిత్ షా, దేశాన్ని తప్పు దోవ పట్టిస్తున్న మోదీ ఎందుకు ఈ బిల్లును ఆపుతున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
పక్క రాష్ట్రం తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారని మరి తమ రాష్ట్రానికి ఎందుకు ఇచ్చేందుకు చేతులు రావడం లేదంటూ ప్రశ్నించారు.
గిరిజనుల అభ్యున్నతి కోసం పాటు పాడుతున్నామని గొప్పలు చెబుతున్న కేంద్ర సర్కార్ దమ్ముంటే రాష్ట్రపతితో సంతకం చేసి పంపించాలని డిమాండ్ చేశారు.
దళితబంధు తరహాలో గిరిజన బంధు అమలు చేస్తామని ప్రకటించారు. బంజారా, ఆదివాసీ భవన్ లు గిరిజన జాతి సముద్దరణ కేంద్రాలు కావాలని ఆకాంక్షించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గిరిజనులు, ఆదివాసీలు, బహుజనులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
ఆదివాసీ బిడ్డల సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని స్పష్టం చేశారు కేసీఆర్(CM KCR). తెలంగాణలో 6 శాతానికి పైగా గిరిజన జాతి ఉందన్నారు. వారి అభ్యున్నతి కోసమే రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించాలని డిసైడ్ అయ్యిందన్నారు.
భారత రాష్ట్రపతిగా ఆదివాసీ బిడ్డనే ఉన్నారని వెంటనే గిరిజనుల సంక్షేమం కోసం రిజర్వేషన్ కల్పించాలని కోరారు సీఎం. విద్వేష రాజకీయాలు బంద్ చేసి ప్రజా సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టాలని సూచించారు.
Also Read : మతతత్వ శక్తుల పట్ల జర భద్రం – కేటీఆర్