CM KCR : సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు. గురువారం ప్రగతి భవన్ లో సీఎం మీడియాతో మాట్లాడారు. ఈ దేశానికి పట్టిన శని కాషాయం అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని, పూర్తిగా కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడ్డారు కేసీఆర్(CM KCR). బీజేపీ నాయకులు డెమోక్రసీని పాతర వేశారంటూ ధ్వజమెత్తారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సోయి లేదా అని ఫైర్ అయ్యారు. నా సర్కార్ ను కూల్చుతానంటే ఊరుకుంటానా అని హెచ్చరించారు. దేశంలో కొలువు తీరిన మోదీ సర్కార్ ఎనిమిది బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చారంటూ ఆరోపించారు కేసీఆర్. ఓ వైపు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగి పోతుంటే సోయి లేకుండా పాలన సాగిస్తున్న మోదీని ఎందుకు ప్రధానిగా భరించాలని ప్రశ్నించారు. దేశాన్ని సర్వ నాశనం చేసిన ఘనత ఆయనదేనని అన్నారు.
దేశానికి చెందిన వనరులను కొద్దిమంది కార్పొరేట్లు, వ్యాపారవేత్తలకు కట్టబెట్టారంటూ ధ్వజమెత్తారు. తమ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ మధ్యవర్తుల వ్యవహారం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యేలతో మాట్లాడిన మొత్తం మాటలతో కూడిన వీడియోను ప్రెస్ మీట్ లో ప్రదర్శించారు. బీజేపీ చేస్తున్న నిర్వాకం గురించి దేశం మొత్తం చూడాలని అన్నారు కేసీఆర్(CM KCR).
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెనుక ఉంటూ నడిపిస్తున్న బండారాన్ని బయట పెడుతున్నానంటూ చెప్పారు. ఊ అంటే టచ్ లో ఉన్నామంటూ అంటున్నారని , ఎంత కాలం ఇలా బెదరిస్తూ పోతారంటూ ప్రశ్నించారు కేసీఆర్. తాను చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు సిఎం.
Also Read : 3 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న షర్మిల