CM KCR : ఏమిచ్చినా రుణం మీ తీర్చుకోలేను

తెలంగాణ సీఎం కేసీఆర్ కామెంట్స్

CM KCR : సిద్దిపేట – భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ బాస్, సీఎం కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సిద్దిపేట న‌గ‌రంలో బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో భారీ బ‌హిరంగ స‌భ‌ను చేప‌ట్టారు. న‌భూతో న‌భ‌విష్య‌త్ రీతిలో భారీ ఎత్తున జ‌నం ప్ర‌భంజ‌న‌మై త‌ర‌లి వ‌చ్చారు. త‌న‌ను ఎంతో సంతోషానికి లోను చేసింద‌న్నారు సీఎం కేసీఆర్.

CM KCR Share his Memories

త‌న‌ను ఉద్య‌మ‌కారుడిగా ఉన్న స‌మ‌యంలో ఈ గ‌డ్డ ఆద‌రించింద‌ని, ఆనాటి నుంచి నేటి రాష్ట్రం ఏర్పాట‌య్యేంత వ‌ర‌కు త‌న‌ను ఆద‌రించింద‌ని, ఈ గ‌డ్డ‌కు తాను రుణ‌ప‌డి ఉన్నాన‌ని, మీ అంద‌రికీ పేరు పేరునా కృత‌జ్ఞ‌త‌లు తెలియ చేసుకుంటున్నాన‌ని అన్నారు సీఎం కేసీఆర్(CM KCR).

ఈ సంద‌ర్భంగా త‌న‌ను సీఎం ప‌ద‌వి చేరుకునేందుకు దోహ‌ద ప‌డిన మీంద‌రిని తాను మ‌రిచి పోలేన‌ని పేర్కొన్నారు. జ‌న్మ‌భూమిని మించిన స్వ‌ర్గం లేద‌న్నారు. సిద్దిపేట పేరు విన్నా..ఇక్క‌డికి వ‌చ్చినా త‌న‌కు ఎన‌లేని బ‌లం క‌లుగుతుంద‌న్నారు ముఖ్య‌మంత్రి.

ఈ సిద్దిపేట గడ్డ నన్ను ఆద‌రించింది. చదువు చెప్పింది. నాకు రాజకీయ జన్మనిచ్చిందని అన్నారు. బీఆర్ఎస్ విజ‌యం ఖాయ‌మ‌ని, గులాబీ జెండా ఎగురుతుంద‌న్నారు కేసీఆర్.

Also Read : Minister KTR : జ‌న నీరాజ‌నం సిరిసిల్ల‌కు వంద‌నం

Leave A Reply

Your Email Id will not be published!