Telangana Secretariat : 17న సచివాలయం ప్రారంభం
సారు పుట్టిన రోజు ముహూర్తం
Telangana Secretariat : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్తగా నిర్మించిన తెలంగాణ సచివాలయం ప్రారంభం కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి పార్టీ చీఫ్ , సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్బంగా దీనిని ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా వచ్చే నెల ఫిబ్రవరి 17న కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్(Telangana Secretariat) ను ప్రారంభించనున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు.
ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. విచిత్రం ఏమిటంటే నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అంత లోపు పూర్తయితే మొత్తాన్ని లేదంటే సీఎం, సీఎస్ ఛాంబర్లు పూర్తి చేసి ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు మంత్రి. ఇప్పటికే సచివాలయం ప్రారంభించాలని ఉందని, కానీ ఇంకా పనులు పూర్తి కాలేదని కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు వేముల ప్రశాంత్ రెడ్డి.
పూర్తయితే సరి లేకున్నా తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా కూలగొట్టి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ సచివాలయం ప్రారంభించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు మంత్రి. ఇదిలా ఉండగా కొత్త సచివాలయానికి భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టారు.
ఈ మొత్తం కొత్త భవనానికి తొలిసారిగా రూ. 400 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. రాను రాను ఆ బడ్జెట్ రూ. 494 కోట్లకు చేరింది. ఇదే సమయంలో మొత్తం ఖర్చును మరోసారి రూ. 619 కోట్లకు పెంచారు. ఇదే సమయంలో రూ. 800 కోట్లు అవుతుందని పేర్కొంది కంపెనీ. చివరకు పూర్తయ్యే సరికి రూ. 1200 కోట్లు పెరిగే అవకాశం ఉందని అంచనా.
Also Read : ఎనిమిదో నిజాం రాజు కన్నుమూత