CM KCR Tour : కేసీఆర్ టూర్ షెడ్యూల్ లో మార్పు
26న అచ్చంపేటకు బదులు వనపర్తి లో
CM KCR Tour : హైదరాబాద్ – తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్(CM KCR) టూర్ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయని బీఆర్ఎస్ పార్టీ వెల్లడించింది. అక్టోబర్ 15 నుండి ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టారు కేసీఆర్.
CM KCR Tour Updates
ఇదిలా ఉండగా అక్టోబర్ 26న అచ్చంపేట, మునుగోడు, నాగర్ కర్నూల్ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ బహిరంగ సభలు నిర్వహించాల్సి ఉంటుంది. వీటికి బదులు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వనపర్తిలో సభ జరుగుతుందని స్పష్టం చేసింది.
ఇక 27న పాలేరు , స్టేషన్ ఘన్ పూర్ లలో సభలు జరగాల్సి ఉండగా వాటికి బదులు మహబూబాబాద్ , వర్దన్న పేటలో సీఎం కేసీఆర్ సభలు జరుగుతాయని వెల్లడించింది. మిగతా సభలన్నీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని తెలిపింది బీఆర్ఎస్ పార్టీ.
రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేసింది. నవంబర్ 3న గెజిట్ , 13 వరకు దరఖాస్తులను స్వీకరించడం, 15 వరకు ఉప సంహరణ ఉంటుందని ఈసీ ప్రకటించింది. నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి.
Also Read : Sunny Deol : హైదరాబాద్ నగరం అద్భుతం