CM KCR Tour : ఎన్నికల ప్రచారం సీఎం ముహూర్తం
15న హుస్నాబాద్ లో భారీ బహిరంగ సభ
CM KCR Tour : హైదరాబాద్ – కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించడంతో బీఆర్ఎస్ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ అలర్ట్ అయ్యారు. 15న కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇదే సమయంలో పార్టీ పరంగా మేని ఫెస్టోపై చర్చిస్తారు.
CM KCR Tour Updates
అనంతరం అదే రోజు హైదరాబాద్ నుంచి బయలు దేరి వెళతారు. అధికారికంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. హుస్నా బాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరవుతారు కేసీఆర్.
లక్షలాది మంది పాల్గొనే సభ సాక్షిగా భారత రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించి మేని ఫెస్టోను విడుదల చేస్తారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాలలో నిర్వహించే బహిరంగ సభలలో పాల్గొంటారు సీఎం కేసీఆర్.
అక్టోబర్ 18న మధ్యాహ్నం 2 గంటలకు ఉమ్మడి పాలమూరు జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే సభకు హాజరవుతారు సీఎం కేసీఆర్.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ముందస్తుగా సీఎం కేసీఆర్(CM KCR) పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 119 సీట్లకు గాను 115 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. ఇందులో ఎక్కువగా ఇప్పటికే కొలువు తీరిన ఎమ్మెల్యేలకే ఛాన్స్ ఇచ్చారు.
7 గురికి మొండి చేయి చూపించారు. వారికి చైర్మన్లుగా, ఇతర పదవులలో భర్తీ చేశారు. వారిలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఆర్టీసీ చైర్మన్ గా, స్టేషన్ ఘన పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు రైతు బంధు సంస్థ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు.
Also Read : BRS Manifesto : బీఆర్ఎస్ మేనిఫెస్టోపై కేసీఆర్ కసరత్తు