CM KCR Tribals Day : ఆదీవాసీలకు బీఆర్ఎస్ సర్కార్ భరోసా
అడవి బిడ్డలకు సీఎం ఆలంబన
CM KCR Tribals Day : ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ అడవి బిడ్డలకు, గిరి పుత్రులకు అభినందనలు తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా తెలంగాణలో అణచి వేతకు, వెనుకబాటుకు గురైన గిరిజనులు ఆత్మ గౌరవంతో బతికేలా చేశాడని బీఆర్ఎస్ పేర్కొంది. రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమంతో పాటు వారి అభివృద్దికి సర్కార్ ఎంతగానో పాటు పడుతోందని తెలిపింది. ప్రత్యేక ప్లాన్స్ అమలు చేసేందుకు కృషి చేశారని వెల్లడించింది. గిరిజనుల సమగ్ర వికాసానికి దోహద పడేలా సంక్షేమ పథకాలను తీసుకు వచ్చిన ఘనత సీఎం కేసీఆర్ ఒక్కడికే దక్కుతుందని స్పష్టం చేసింది.
CM KCR Tribals Day Wishes
రాష్ట్రంలో ఉన్న 3,145 తండాలు, గూడేలాను గ్రామ పంచాయతీలుగా చేశామని తెలిపింది బీఆర్ఎస్. ఆదివాసీలకు ప్రత్యేకంగా కొమురం భీమ్ ఆదీవాసీ భవన్ , సేవా లాల్ బంజారా భవన్ లను సీఎం కేసీఆర్(KCR) మంజూరు చేశారని వెల్లడించింది . ఆదివాసీ పండుగలను, జాతరలను అధికారికంగా తెలంగాణ సర్కార్ నిర్వహిస్తోందని తెలిపింది.
1,50,000 మంది ఆదివాసీ, గిరిజనులకు పోడు భూములపై యాజమాన్య హక్కులను కల్పించిన ఘనత కేసీఆర్ దేనని స్పష్టం చేసింది. విద్యా, ఉద్యోగ రంగాలలో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ సౌకర్యాన్ని 10 శాతానికి పెంచిందని తెలిపింది. 161 రెసిడెన్షియల్ స్కూళ్లు, 118 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, 22 డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశారని పేర్కొంది బీఆర్ఎస్.
Also Read : Hema Malini : రాహుల్ ఫ్లైయింగ్ కిస్ చూడలేదు