CM KCR Tribute : గద్దర్ కు కేసీఆర్ నివాళి
కుటుంబీకులకు సీఎం ఓదార్పు
CM KCR Tribute : ప్రజా యుద్ద నౌక గద్దర్ పార్థివ దేహానికి సీఎం కేసీఆర్(KCR) నివాళులు అర్పించారు. సోమవారం సాయంత్రం ఆల్వాల్ కు చేరుకున్నారు సీఎం. గద్దర్ భౌతిక కాయాన్ని సందర్శించారు. కుటుంబీకులను పరామర్శించారు. ఎలా జరిగిందని తనయుడిని, భార్య విమలను అడిగి తెలుసుకున్నారు కేసీఆర్. ప్రభుత్వ పరంగా సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.
CM KCR Tribute to Gaddar
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలకు సిద్దమైంది. గద్దర్ చివరి కోరిక మేరకు తాను 1991లో స్థాపించిన మహా బోధి స్కూల్ ప్రాంగణంలోనే తనకు అంత్యక్రియలు చేయాలని కోరారు. ఆ మేరకు కుటుంబీకులు గద్దర్ చివరి కోరిక మేరకు ఇక్కడే బౌద్ధ మతం ప్రకారం అంత్యక్రియలు చేశారు.
అంతకు ముందు గద్దర్ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం లాల్ బహదూర్ స్టేడియంలో ఉంచారు. ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి కవులు, కళాకారులు, రచయితలు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు చివరి సారిగా గద్దర్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
సోమవారం ఉదయం 11.45 నిమిషాలకు అంతిమ యాత్ర ప్రారంభమై సాయంత్రానికి ఆల్వాల్ నివాసానికి చేరుకుంది. దాదాపు 6 గంటలక పైగా సమయం పట్టింది గద్దర్ దేహం రావడానికి. ఒక యోధుడు, ప్రజా గాయకుడు ఈ లోకాన్ని వీడడం తెలంగాణకు తీరని నష్టం.
Also Read : Gaddar Comment : ప్రజా వాగ్గేయకారుడా అల్విదా