CM KCR Ambedkar Statue : భారీ అంబేద్క‌ర్ విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ

ఆవిష్క‌రించిన సీఎం కేసీఆర్

CM KCR Ambedkar Statue : దేశంలోనే అతి పెద్ద డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని శుక్ర‌వారం ఆవిష్క‌రించారు సీఎం కేసీఆర్. ఈ విగ్ర‌హం రాష్ట్రానికి, దేశానికి స్పూర్తిగా నిలుస్తుంద‌న్నారు. జై భీమ్ అంటూ నిన‌దించారు. ఈ కార్య‌క్ర‌మానికి భార‌త రాజ్యాంగ నిర్మాత అంబేద్క‌ర్ మ‌నుమ‌డు ప్ర‌కాశ్ అంబేద్క‌ర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రం న‌డి బొడ్డున హుస్సేన్ సాగ‌ర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్ర‌హాన్ని సీఎం కేసీఆర్, ప్ర‌కాశ్ అంబేద్క‌ర్(CM KCR Ambedkar Statue) ఆవిష్క‌రించ‌డం విశేషం. ఈ సంద‌ర్బంగా ఆకాశం నుంచి హెలికాప్ట‌ర్ ద్వారా అంబేద్క‌ర్ విగ్ర‌హంపై పూల వ‌ర్షం కురిపించారు. దేశంలో ఎక్క‌డా లేని రీతిలో అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌డం చ‌రిత్ర‌లో నిలిచి పోతుంద‌ని చెప్ప‌డంలో అతిశ యోక్తి లేదు.

విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ముందు బౌద్ధ భిక్షువులు ప్రార్థ‌న‌లు చేశారు. రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధ సంస్థ‌ల చైర్మ‌న్లు , వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. దేశానికే త‌ల‌మానికంగా అంబేద్క‌ర్ విగ్ర‌హం నిలిచేలా చేయ‌డం త‌న‌కు ఆనందంగా ఉంద‌న్నారు. అతి త‌క్కువ కాలంలో దీనిని నిర్మించార‌ని వారంద‌రినీ అభినందించారు సీఎం కేసీఆర్(CM KCR).

Also Read : ఢిల్లీలో విద్యుత్ స‌బ్సిడీ బంద్

Leave A Reply

Your Email Id will not be published!