CM KCR : సీఎం కేసీఆర్ వైర‌ల్

సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్

CM KCR : హైద‌రాబాద్ – భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ (బీఆర్ఎస్) బాస్ , సీఎం కేసీఆర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నిలేదు. ఉద్య‌మ నాయ‌కుడిగా, క‌విగా, ర‌చ‌యిత‌గా, గాయ‌కుడిగా, బ‌హు భాషా కోవిదుడిగా, రాష్ట్రాన్ని సాధించిన యోధుడిగా ఇప్ప‌టికే భార‌త దేశ చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచి పోయాడు. ప్ర‌స్తుతం ముచ్చ‌ట‌గా మూడవ సారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి కావాల‌ని వ్యూహాలు ప‌న్నుతున్నారు.

CM KCR Viral

ప్లాన్స్ వేయ‌డంలో, ప్ర‌త్య‌ర్థులు ఎంత‌టి వారైనా వారికి దిమ్మ తిరిగేలా షాక్ ఇవ్వ‌డంలో త‌న‌కు తానే సాటి . ప్ర‌స్తుతం బీఆర్ఎస్ పై ఫోక‌స్ పెట్టారు. ఈనెల 15న పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో. ఈ సంద‌ర్బంగా ఇప్ప‌టికే 119 నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల‌కు పార్టీ ప‌రంగా బీ-ఫారమ్ లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.

తాజాగా రాష్ట్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, ఎక్సైజ్ శాఖ మంత్రి విర‌స‌నోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్(V Srinivas Goud) మ‌ర్యాద పూర్వ‌కంగా సీఎం కేసీఆర్ ను క‌లిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు ట్విట్ట‌ర్ లో. మ‌రో వైపు ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్ సాయంతో సీఎం కేసీఆర్ కు సంబంధించి డిఫ‌రెంట్ గా ఫోటోలు డిజైన్ చేసి బ‌య‌ట‌కు వ‌దులుతున్నారు. ఇవి ఊహించ‌ని స్థాయిలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు.

Also Read : Eatala Rajender : సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తా

Leave A Reply

Your Email Id will not be published!