CM KCR Viral : సీఎం కేసీఆర్ హల్ చల్
సోషల్ మీడియాలో వైరల్
CM KCR Viral : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. ఆయా పార్టీలు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. ఒక దానిపై మరొక పార్టీ ఆరోపణలు చేసుకుంటూ మరింత రక్తి కట్టిస్తున్నాయి. ఈ తరుణంలో ఇటీవలి కాలంలో టెక్నాలజీలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి.
CM KCR Viral Photos
ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చాట్ జీపీటి తోడ్పాటుతో ఆయా పార్టీలకు చెందిన నేతలను డిఫరెంట్ యాంగిల్స్ లలో ఫోటోలు క్రియేట్ చేస్తూ షేర్ చేస్తూ వస్తున్నాయి పార్టీలు.
తాజాగా భారత రాష్ట్ర సమితి పార్టీ బాస్ , తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఆయనకు సంబంధించి డిఫరెంట్ ఫోటోస్ ఇప్పుడు సామాజిక మాధ్యమాలను ముంచెత్తుతున్నాయి. వివిధ సినిమాలలో టాప్ హీరోలకు సంబంధించిన మేనరిజంకు తగ్గట్టుగా కేసీఆర్ ఫోటోలను క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు.
తాజాగా సీఎం కేసీఆర్ కు సంబంధించి తయారు చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట్లో గులాబీ శ్రేణులను విస్తు పోయేలా , ఆకట్టుకునేలా చేస్తోంది. మొత్తంగా సీఎం కేసీఆరా మజాకా అంటూ పేర్కొంటున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా మారారు బీఆర్ఎస్ బాస్.
Also Read : Telangana Congress : ఆడబిడ్డ చావును అవమానిస్తే ఎలా