KCR : జ్వరం నుంచి కోలుకున్న సీఎం కేసీఆర్ తాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ఇవాళ దర్శిస్తారు. రోడ్డు మార్గం గుండా అక్కడికి చేరుకుంటారు.
గత కొంత కాలంగా యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక చివరి దశకు చేరుకున్న పనుల్ని స్వయంగా కేసీఆర్(KCR) పరిశీలిస్తారు.
వచ్చే నెల మార్చి 22 నుంచి 28 వరకు వారం రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించనున్నారు. వీటిని నభూతో నభవిష్యత్ అన్న రీతిలో చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించారు సీఎం.
దేశ విదేశాల నుంచి యాదాద్రి పునః ప్రారంభ వేడుకలకు అతిథులు, పీఠాధిపతులు, యోగులు, స్వాములు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలపై కేసీఆర్(KCR) సమీక్ష చేపడతారు.
మౌలిక వసతుల కల్పనపై కూడా దృషి సారిస్తారు. ఇప్పటికే టీటీడీ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన గోపురానికి బంగారు తాపడం పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
ఇందు కోసం 120 కిలోల బంగారం అవసరం అవుతుందని ఇప్పటికే అంచనా వేశారు. ఇదిలా ఉండగా ఇందు కోసం 30 కిలోల పసిడికి సరిపడా నగదు రాగా 40 కిలోల బంగారం వివిధ వర్గాల నుంచి అందింది.
ఇంకా 50 కిలోల బంగారాన్ని సేకరించాల్సి ఉంది. కేసీఆర్ తలుచుకుంటే దీనిని సేకరించడం పెద్ద పని కాదు. ఆయన చిటికేస్తే 40 కిలోలేంటి అంతకు ఎక్కువే సమకూరుతుంది.
కాక పోతే స్వామి వారికి భక్తుల నుంచి సేకరించాలని నిర్ణయించారు ఇప్పటికే ఈఎం కేసీఆర్.
Also Read : స్వామీ సదా స్మరామి