CM KCR Wishes : కేసీఆర్ దసరా శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి
CM KCR Wishes : హైదరాబాద్ – దసరా పండుగను పురస్కరించుకుని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉన్నదని సీఎం స్పష్టం చేశారు. విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయ దశమి పేరుతో దేశ వ్యాప్తంగా జరుపుకుంటారని కేసీఆర్(CM KCR) పేర్కొన్నారు.
CM KCR Wishes for Dussehra
దసరా నాడు కుటుంబంలోని సభ్యులందరూ ఒకే చోట గుమికూడి సామూహికంగా సంబురాలు జరుపు కోవడం తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. సోమవారం పండుగ సందర్భంగా ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
శమిపూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలాయ్ బలాయ్ తీసుకోవడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం శుభ సూచకంగా భావించే పాల పిట్టను దర్శించు కోవడం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమని సీఎం తెలిపారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు, అగ్ర పథాన కొనసాగించేందుకు విజయ దశమి స్ఫూర్తితో అలుపెరుగని పోరాటం కొనసాగుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణకు నిత్య విజయాలు కలిగేలా దుర్గా మాత కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలందరికీ సుఖ సంతోషాలను ప్రసాదించాలని సీఎం దుర్గామాతను ప్రార్థించారు.
Also Read : Raja Singh : మళ్లీ గెలుస్తా నేనేంటో చూపిస్తా