CM KCR Zaheeruddin : సియాసత్ ఎడిటర్ మృతి తీరని లోటు
సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
CM KCR Zaheeruddin : ప్రజా గాయకుడు గద్దర్ అంతిమ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఉర్దూ దినపత్రిక సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ తీవ్రమైన తొక్కిసలాటలో ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డారు. ఆయనను హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చని పోయి ఉన్నారని వైద్యులు నిర్ధారించారు. దీంతో తీవ్ర విషాదం అలుముకుంది తెలుగు మీడియా రంగంలో.
CM KCR Zaheeruddin Paid Tribute
పత్రికా విలువలకు పెద్ద పీట వేస్తూ వచ్చారు జహీరుద్దీన్(Zaheeruddin) అలీఖాన్. ఆయన మృతి పట్ల తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం ఉర్దూ పత్రిక ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు.
పత్రికా సంపాదకుడిగా తెలంగాణ ఉద్యమంలో జహీరుద్దీన్ అలీ ఖాన్ కీలకమైన పాత్ర పోషించారని కొనియాడారు. ఆనాడు ఆంధ్రా పాలకులు, పత్రికలు, ఛానళ్లు పెద్ద ఎత్తున వ్యతిరేకత ప్రదర్శించాయని కానీ కొన్ని పత్రికలు, ఛానళ్లు మాత్రం తమకు అండగా నిలిచాయని గుర్తు చేశారు.
తాము చేపట్టిన ఆనాటి పోరాటాలకు, ఉద్యమాలకు, ప్రత్యేకించి తనకు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారని ప్రశంసించారు. తనకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడిని కోల్పోయానని పేర్కొన్నారు.
Also Read : CM KCR Tribute : గద్దర్ కు కేసీఆర్ నివాళి