KCR Rahul : సీఎం కేసీఆర్ నోట ‘రాహుల్’ మాట

ఇంత‌కూ ఎవ‌రీ రాహుల్ క‌థేంటి

KCR Rahul : సీఎం కేసీఆర్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ప్ర‌జా నాయ‌కుడే కాదు ఉద్య‌మ‌కారుడు, ప్ర‌స్తుతం తెలంగాణ‌కు అన్నీ ఆయ‌నే. విస్తృత‌మైన అవ‌గాహ‌న క‌లిగిన వ్య‌క్తి. అంతే కాదు ఏ స‌బ్జెక్టునైనా అన‌ర్ఘ‌లంగా మాట్లాడ‌గ‌లిగే స‌త్తా ఉన్నోడు కేసీఆర్.

ఆయ‌న ఏది మాట్లాడినా ఓ సంచ‌ల‌న‌మే. రాష్ట్ర‌మే కాదు దేశ వ్యాప్తంగా ఏ రంగం గురించైనా చెప్ప‌గ‌ల‌డు. ఇంతలా పాపుల‌ర్ అయిన ఈ రాజ‌కీయ నాయ‌కుడు త‌ను ప్రెస్ మీట్ పెట్టిన‌ప్పుడ‌ల్లా ఒకే ఒక్క పేరు ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తూ ఉంటారు.

అత‌ను ఎవ‌రో కాదు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ రాహుల్. తాజాగా ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మ‌రోసారి రాహుల్ పేరును ప్ర‌స్తావించారు కేసీఆర్(KCR Rahul). తాను ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు.

ద‌మ్ముంటే భార‌తీయ జ‌న‌తా పార్టీ, కాంగ్రెస్ పార్టీల‌ను డేట్ ఫిక్స్ చేయాల‌ని అసెంబ్లీని ర‌ద్దు చేసేందుకు రెడీగా ఉన్నాన‌ని చెప్పాడు కేసీఆర్.

ఇదే స‌మ‌యంలో ఆయా పార్టీల‌కు రాహుల్ నువ్వే మీడియేట‌ర్ గా ఉండాల‌ని కోరారు సీఎం.

దీంతో స‌మావేశంలో న‌వ్వులు విర‌బూశాయి. ఒక్కోసారి హైలెట్ చేయ‌డం మ‌రోసారి రాహుల్ ను విమ‌ర్శించ‌డం ప‌రిపాటిగా మారింది కేసీఆర్ కు.

కొన్ని ప్ర‌శ్న‌లు వేసినందుకు కేసీఆర్ ఒక‌సారి ఫైర్ కూడా అయ్యారు.

దీంతో మ‌రింత పాపుల‌ర్ గా మారారు జ‌ర్న‌లిస్ట్ రాహుల్. ఎన్. రాహుల్ హైద‌రాబాద్ నివాసి. సీఎం కార్యాల‌యంలో అధికారిక కార్య‌క్ర‌మాల‌ను

క‌వ‌ర్ చేసే ఆంగ్ల దిన‌ప‌త్రిక ది హిందూకి సీనియ‌ర్ క‌రెస్పాండెంట్.

నిజాం కాలేజీలో చ‌దివారు రాహుల్. మాజీ సీఎం ఎన్. కిర‌ణ్ కుమార్ రెడ్డికి స‌న్నిహితుడు కూడా. ఇద్ద‌రూ క్లాస్ మేట్స్. ఆర్టీఐలో చేర‌మ‌ని కోరినా

రాహుల్ తిర‌స్క‌రించిన‌ట్లు స‌మాచారం.

ఎంతో మంది సీఎంల‌తో చ‌నువు ఉన్నా త‌ను మాత్రం గీత దాటడు అన్న ప్ర‌చారం ఉంది.

Also Read : ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్లే ద‌మ్ముందా – కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!