Kejriwal MK Stalin : స్టాలిన్ తో కేజ్రీవాల్ ములాఖత్
జూన్ 2న హేమంత్ సోరేన్ తో భేటీ
Kejriwal MK Stalin : ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జూన్ 1 గురువారం తమిళనాడుకు వెళ్లనున్నారు. సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) తో ములాఖత్ కానున్నారు. అక్కడి నుంచి 2న శుక్రవారం జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ తో భేటీ కానున్నారు. కేంద్రం ఢిల్లీ ప్రభుత్వం పట్ల అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా కేంద్రం పట్టించు కోవడం లేదని ఆరోపించారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఇదే సమయంలో కేంద్రం ఆర్డినెన్స్ తీసుకు వచ్చిందని పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనుందని తెలిపారు. బుధవారం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.
ఇదిలా ఉండగా గత కొన్నేళ్లుగా సుప్రీంకోర్టులో కేంద్రం వర్సెస్ ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య కేసు నడిచింది. చివరకు సీజేఐ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. శాంతి భద్రతలు, భూ సంబంధ వ్యవహారాలు మాత్రమే లెఫ్టినెంట్ గవర్నర్ పరిధిలో ఉంటాయని మిగతా అంశాలన్నీ ఢిల్లీ ప్రభుత్వానికి చెల్లుతాయని తీర్పు చెప్పింది. కానీ తీర్పు కు వ్యతిరేకంగా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది.
ఇదిలా ఉండగా చట్టం పాస్ కావాలంటే పార్లమెంట్ లోని లోక్ సభ, రాజ్య సభలో పాస్ కావాల్సి ఉంటుంది. కాగా లోక్ సభలో బిల్లు పాస్ అయినా రాజ్యసభలో పాస్ కావాలంటే ప్రతిపక్షాల మద్దతు అవసరం. ఇందుకు సంబంధించి ఆప్ తరపున ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే బీహార్ సీఎం నితీశ్ కుమార్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేను కలుసుకున్నారు. తాజాగా తమిళనాడు, జార్ఖండ్ సీఎంలను కలవనున్నారు.
Also Read : Wrestlers Protest