CM Madhya Pradesh : మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో శ్రీరామ నవమి సందర్భంగా హింసకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై బుల్ డోజర్లు ఉపయోగించడంపై విపక్షాలు మండిపడ్డాయి.
దీనిపై తీవ్రంగా స్పందించారు సీఎం. కాగా తమ ప్రభుత్వం తీసుకున్న చర్యను ఆయన సమర్థించారు. పేదలను ఇబ్బంది పెట్టే వారిపై బుల్డోజర్లు ఉపయోగిస్తే తప్పేంటి అంటూ ప్రశ్నించారు శివ రాజ్ సింగ్ చౌహాన్(CM Madhya Pradesh ). ఖార్గోన్ లో పేదల ఇళ్లను తగుల బెట్టారు.
భోపాల్ లో జరిగిన ర్యాలీలో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను ధ్వంసం చేసేందుకు కొందరు సంఘ విద్రోహ శక్తులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు శివ రాజ్ సింగ్ చౌహాన్.
తమ సర్కార్ ప్రజల కోసం పని చేస్తోందని, వారికి ఇబ్బందులు కలిగిస్తే ఊరుకోబోమంటూ హెచ్చరించారు సీఎం. రాష్ట్రంలో నేరస్థులు, గూండాలను సాగనివ్వమని వార్నింగ్ ఇచ్చారు.
ఎక్కడ ఉన్నా వారిని వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు. ఇదిలా ఉండగా మధ్య ప్రదేశ్ లోని రెండు జిల్లాల్లో ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా ఊరేగింపులు జరిగాయి.
ఈ తరుణంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాళ్లు కూడా విసిరినట్లు ఆరోపణలు వచ్చాయి. కొన్ని ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. ఇళ్లను తగుల బెట్టారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేగింది.
ఈ ఘటనలో పలువురిని అరెస్ట్ చేశారు. కేసులు నమోదు చేశారు. 95 మందిని అదుపులోకి తీసుకున్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దించారు. అక్కడ అత్యవసర పరిస్థితిని విధించింది సర్కార్.
Also Read : మోదీ తెల్లతోలు కప్పుకున్న పాలకుడు