Mamata Banerjee : అమర్త్య సేన్ కు నోటీస్ సీఎం సీరియస్
ఖాళీ చేయాలన్న యూనివర్శిటీ
Mamata Banerjee : నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్య సేన్ కు అవమానం జరిగింది. విశ్వ భారతి విశ్వ విద్యాలయం ఏప్రిల్ 19న అమర్త్య సేన్ కు బహిష్కరణ నోటీసు పంపారు. మే 6 లోపు తన నివాసంలోని 1.38 ఎకరాల భూమిలో ఖాళీ చేయాలని కోరారు. ఇప్పటికే అమర్త్య సేన్ కు ప్రభుత్వం తరపున రిజిస్ట్రేషన్ కాగితాలను కూడా అందజేసింది. స్వయంగా సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) ఆయన ఇంటికి వెళ్లి ఇచ్చారు. ఖాళీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
అమర్త్య సేన్ కు విశ్వ భారతి నోటీసు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు మమతా బెనర్జీ(Mamata Banerjee). నోటీసు కు వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమస్యపై శాంతి నికేతన్ లో తేల్చుకుంటానని హెచ్చరించారు సీఎం.
బీర్బూమ్ జిల్లా లోని శాంతి నికేతన్ లో నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్య సేన్ నివాసం వెలుపుల ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. కేబినెట్ భేటీలో దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించారు సీఎం. ఎంఎస్ఎంఈ మంత్రి చంద్రనాథ్ సిన్హా, స్థానిక ఎమ్మెల్యే ఈ నిరసనకు నాయకత్వం వహించాలని స్పష్టం చేశారు. విద్యా శాఖ మంత్రి బ్రత్యా బసు, పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఫిర్హాద్ హకీమ్ కూడా ఉన్నారు.
గత ఏప్రిల్ 19న సేన్ కు తొలగింపు నోటీసు పంపింది విశ్వ భారతి. మే 6 లోపు ఖాళీ చేయాలని కోరింది. శాంతి నికేతన్ లో అమర్త్య సేన్ కు 1.38 ఎకరాల భూమి ఉంది. కాగా 1.25 ఎకరాల కంటే ఎక్కువ ఉందని , మిగతాది ఇవ్వాల్సిందేనంటూ నోటీసు జారీ చేయడం కలకలం రేపింది. ఇదిలా ఉండగా 1921లో రవీంద్ర నాథ్ ఠాగూర్ దీనిని స్థాపించారు. బెంగాల్ లో ఉన్న ఏకైక కేంద్రీయ విశ్వ విద్యాలయం. దీనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఛాన్సలర్ గా ఉన్నారు.
Also Read : మోదీ కోరితే రాజీనామా చేస్తా